బాలయ్య (Balakrishna) కెరీర్ బిగినింగ్ నుండి అందం అంటే పడిచస్తారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి స్టార్స్ సినిమాల్లో విగ్గులో కనిపించినా పబ్లిక్ లో నాచురల్ లుక్ లో కనిపించేవారు.
అఖండ (Akhanda) మూవీ సక్సెస్ టాక్ తెచ్చుకోగా బాలయ్య ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. రెండు భిన్న పాత్రల్లో బాలయ్య అలరించారు. ముఖ్యంగా అఘోరా పాత్రలో ఆయన నటవిశ్వరూపం ఫ్యాన్స్ ని సీట్లలో కూర్చో నివ్వలేదు. ఆయన హైవోల్టేజ్ డైలాగులకు థియేటర్స్ ఈలలు, అరుపులతో మారుమ్రోగిపోయాయి. కాగా ఈ మూవీ చిన్న పిల్లలకు కూడా బాగా నచ్చిందన్న బాలయ్య... వాళ్ళు తనను అలా పిలవడం అసలు నచ్చలేదంటున్నాడు. అఖండ మూవీ చూసిన కొందరు పిల్లలు బాలయ్య వద్దకు వచ్చి 'అంకుల్ సినిమా చాలా బాగుంది' అని చెప్పారట. పిల్లలు తన సినిమాను మెచ్చుకోవడం ఆనందం కలిగించినా అంకుల్ అన్న వాళ్ళ పిలుపు మాత్రం నచ్చలేదట. అయితే ఈ మాట బాలయ్య సరదాగా చెప్పాడు లెండి.
బాలయ్య (Balakrishna) కెరీర్ బిగినింగ్ నుండి అందం అంటే పడిచస్తారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి స్టార్స్ సినిమాల్లో విగ్గులో కనిపించినా పబ్లిక్ లో నాచురల్ లుక్ లో కనిపించేవారు. అలాగే సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ విషయంలో చాలా సింపుల్. తెరపై చాలా స్టైలిష్ గా కనిపించే ఆయన, ఆఫ్ స్క్రీన్ లో ఎటువంటి మేకప్, విగ్గు లేకుండా సహజంగా దర్శనం ఇస్తారు.
undefined
కానీ బాలయ్య అలా కాదు. ఆయనకు జుట్టు పోయిన నాటి నుండి విగ్గుతో మానేజ్ చేస్తున్నారు. బాలయ్య తన విగ్గులను స్వయంగా డిజైన్ చేయించుకుంటారు. తన సినిమాలో విగ్గు విషయంలో కూడా నిర్ణయం బాలయ్యదే అని టాక్. లండన్ లో ప్రత్యేకంగా బాలయ్య తన విగ్గులను డిజైన్ చేయిస్తారట.
Also read బెనిఫిట్ షో ఎఫెక్ట్ : `అఖండ` థియేటర్ సీజ్
మనం ఎంత అందగాళ్ళమైనా వయసుతో పాటు వచ్చే మార్పులను అంగీకరించాలి. 61ఏళ్ల బాలయ్య మాత్రం ఇంకా యువకుడిగానే ఫీల్ అవుతున్నాడు. తాత వయసులో ఉండి అంకుల్ అని పిలిస్తే తట్టుకోలేకపోతున్నారు. మరి బాలయ్య తనను ఇంకా 25ఏళ్ల యువకుడిగా భావిస్తున్నాడు. అందుకే తన సినిమాల్లో హీరోయిన్స్ గా యంగ్ బ్యూటీస్ ని ఎంపిక చేసుకుంటున్నాడు. ఇంకా ప్రేమ, పెళ్లి చేసుకునే పాత్రలు చేస్తున్నారు. ఒక విషయంలో మాత్రం బాలయ్యను మెచ్చుకోవాలి. లుక్ సంగతి ఎలా ఉన్నా ఆయన ఎనర్జీ మాత్రం యంగ్ ఫెలోస్ ని తలపిస్తుంది.
Also read Akhanda: బాలయ్య - బోయ మాస్.. రికార్డుల జాతర, 'లవ్ స్టోరీ'ని అధికమించిన అఖండ