తమ్ముడు రామ్‌కి మహా తిక్క.. ఆయనది పీహెచ్‌డి, నాదింకా డిగ్రీనే.. `స్కంద` ఈవెంట్‌లో బాలయ్య కామెంట్స్..

Published : Aug 27, 2023, 12:25 AM IST
తమ్ముడు రామ్‌కి మహా తిక్క.. ఆయనది పీహెచ్‌డి, నాదింకా డిగ్రీనే.. `స్కంద` ఈవెంట్‌లో బాలయ్య కామెంట్స్..

సారాంశం

రామ్‌ గురించి చెబుతూ తమ్ముడు రామ్‌ అంటూ సంభోదించారు బాలయ్య..  తెలంగాణ యాస, భాషలో ‘ఇస్మార్ట్ శంకర్’ తీసి నాకూ సవాల్ విసిరారు. `భగవంత్ కేసరి`తో తెలంగాణ యాసతో సినిమా చేస్తున్నానని తెలిపారు. 

`మా తిక్కకి లెక్కలేని మహాతిక్క.. రామ్‌ పోతినేని. ఆయన పీహెచ్‌డీ చేస్తుంటే, నేను డిగ్రీ చేస్తున్నా, ఆయన్ని నేను ఫాలో అవుతున్నా, మళ్లీ ఆయన నన్ను ఫాలో అవుతున్నాడు` అంటూ క్రేజీగా మాట్లాడారు బాలయ్య. రామ్‌ పోతినేని హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా నటించిన చిత్రం `స్కంద`, బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగింది. దీనికి గెస్ట్ గా బాలకృష్ణ హాజరయ్యారు. ఆయన రామ్‌ని ఓ ఆట ఆడుకున్నారు. 

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, రామ్‌గురించి చెబుతూ తమ్ముడు రామ్‌ అంటూ సంభోదించారు.  తెలంగాణ యాస, భాషలో ‘ఇస్మార్ట్ శంకర్’ తీసి నాకూ సవాల్ విసిరారు. నేను `భగవంత్ కేసరి`తో తెలంగాణలో దిగుతున్నాను. ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్2’లో మళ్లీ రాబోతుండటం సంతోషం. ఈ విషయంలో ఆయనది పీహెచ్‌డీ అయిపోయింది. నేనింకా డిగ్రీనే చేస్తున్నారు. ఆయన్ని నేను ఫాలో అవుతున్నా. `ఇస్మార్ట్ శంకర్‌2`తో మళ్లీ ఆయన నన్ను ఫాలో అవుతున్నాడ`ని తెలిపారు బాలయ్య. అందుకు రామ్‌ స్పందిస్తూ `నేను చదివే స్కూల్‌లో మీరే హెడ్‌ మాస్టర్‌` అని చెప్పగా, బాలయ్య ఆనందంతో ఉప్పొంగిపోయారు. 

అనంతరం ఇంకా మాట్లాడుతూ, రామ్‌కి మహా తిక్క అని, 2006లో ఆయన జర్నీ ప్రారంభమైందని, మొదటి సినిమాకి నేను గెస్ట్ గా వెళ్లాను. ఈ జర్నీలో ఎన్నో రకాల సినిమాలు చేశాడు, ఎన్నో భిన్నమైన పాత్రలు పోషించాడు, తన సినిమా ద్వారా ఎంతో కొంతదనం ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. మనం గర్వించదగ్గ నటుడు. కళామతల్లి మనకు ఇచ్చిన వరం రామ్‌. ఈ సినిమాతోనూ అలరించనున్నారని చెప్పారు. శ్రీలీల గురించి చెబుతూ, అందం,అభినయం, మంచి నటన కలగలిపిన అమ్మాయి మన తెలుగమ్మాయి కావడం గర్వంగా ఉంది. చాలా అరుదుగానే తెలుగు అమ్మాయిలు రాణించారు. ఇప్పుడు శ్రీలీల రాణిస్తుంది. ఎంతో డెడికేషన్‌తో వర్క్ చేస్తుంది. నాతో `భగవంత్‌ కేసరి`లో నటిస్తుంద`న్నారు. 

బోయపాటి గురించి చెబుతూ, `సింహా`, `లెజెండ్‌`, `అఖండ`సినిమాలు చేశాం. మూడు ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఇలా చేయాలని చేయలేదు, డెడికేషన్‌తో చేశాం, ఆడియెన్స్ ఆదరించారు, పెద్ద విజయాలు అందించారు. వైవిధ్యమైన సినిమాలు అందించేందుకు బోయపాటి ముందుంటారు. ఎంతో తపిస్తుంటారు. సంగీత దర్శకుడు థమన్‌ ఏంటో `అఖండ`తో నిరూపించాడు. బాక్సులు బద్దలయ్యేలా చేశాడు. ఇప్పుడు మరోసారి వస్తున్నారు అని తెలిపారు. ఈ సందర్భంగా థమన్‌ బరువు పై సెటైర్లు పేల్చాడు. 

ఇక సినిమాల్లో కొత్త దనం గురించి చెబుతూ, అలాంటి సినిమాలను నిర్మాతలు నిర్మించాలని, ఆడియెన్స్ ని థియేటర్‌కి రప్పించాలన్నారు. అదే సమయంలో సినిమా అంటే వినోదం మాత్రమే కాదు, మంచి సందేశం కూడా ఉండాలని, యువతని ప్రోత్సహించేలా, వారిని ఇన్‌స్పైర్‌ చేసేలా ఉండలన్నారు. ఈ సందర్భంగా చంద్రయాన్‌ 3లో పాల్గొన మన గద్వాల్‌ కి చెందిన కృష్ణ గురించి చెప్పారు. కమ్మరి సామాజిక వర్గంలో జన్మించిన కృష్ణ గ్రూప్ 1లో ఉద్యోగం సంపాదించి ఇస్రో ఎగ్జామ్‌ రాసి చంద్రయాన్‌ 3లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నాడని, ఆయన డిజైన్‌ చేసిన దాన్నే వాడుకున్నారని, భూకంపాలను గుర్తించే పరికరాన్ని కృష్ణ డిజైన్‌ చేసినట్టు బాలయ్య చెప్పడం విశేషం. ఈ సందర్భంగా సినిమా పెద్ద విజయం సాధించాలని తెలిపారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది
చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?