మరి ఆ బ్లడ్డూ, బ్రీడూ ఎవరిది అంటూ బాలయ్యపై విమర్శలు

Published : Sep 01, 2017, 03:28 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
మరి ఆ బ్లడ్డూ, బ్రీడూ ఎవరిది అంటూ బాలయ్యపై విమర్శలు

సారాంశం

రాజకీయాలపై స్టన్నింగ్ కమెంట్స్ చేసిన బాలకృష్ణ నందమూరి వంశానికే రాజకీయం చెల్లిందంటూ వ్యాఖ్యలు కొందరు ఏం పీకారు అంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు

సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వస్తే నిలవడం అంత ఈజీ కాదంటూ నందమూరి బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలపై సోషల్ మీడియాలో పెను దుమారం రేగుతోంది. సినిమా వాళ్లు రాజకీయాల్లో రాణించడం అంటే అది ఒక్క ఎన్టీఆర్ కే సాధ్యమైందని, అది ఇంకెవరికీ చెల్లుబాటు కాదని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.

 

అంతే కాదు మేము తప్ప సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయిన కుటుంబం లేదని బాలయ్య కుండబద్ధలు కొట్టారు. అంతేకాదు అమితాబ్, చిరంజీవి లాంటి వాళ్లు ఏం పీకలేకపోయారని వ్యాఖ్యానించారు బాలయ్య. అంతే కాదు తమ బ్లడ్ వేరంటూ బీరాలు పోయారు.

 

దీంతో బాలకృష్ణ మీడియా ఛానెల్ తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకోవాలి కదా అంటూ.. సోషల్ మీడియాలోనే కాక సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకరి గురించి మాట్లాడేటప్పుడు మన ఫ్యామిలీ చరిత్ర సరిగ్గా గుర్తు చేసుకోవాలని విమర్శలు వస్తున్నాయి.

 

మరి బాలకృష్ణ అన్న.. నందమూరి హరికృష్ణది కూడా అదే రక్తం కదా.. నందమూరి రక్తమే కదా.. ఆయన అన్న టీడీపీ పార్టీ పెట్టి ఒక్క సీటు కూడా గెలవకుండా.. దాన్ని మూసేయలేదా అంటూ.. విమర్శలు వస్తున్నాయి. మా బ్లడ్, మా బ్రీడ్ అంటూ బీరాలు పోతున్న బాలయ్య హరికృష్ణది ఏ బ్లడ్డో, ఏ బ్రీడో చెప్తే బాగుంటుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

 

రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడు ఈ బ్లడ్డూ, బ్రీడూ ఏం చేశాయో గుర్తు చేసుకుని.. నోటికొచ్చిందల్లా మాట్లాడకుండా.. అన్నీ చూసుకుని వుంటే బాగుంటుందని సూచిస్తున్నారు జనం.

PREV
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?