మోక్షజ్ఞ బర్త్ డే వేడుకల్లో బాలయ్య... ఈ ఏడాదైనా ఎంట్రీ ఉంటుందా?

Published : Sep 06, 2022, 09:38 PM IST
మోక్షజ్ఞ బర్త్ డే వేడుకల్లో బాలయ్య... ఈ ఏడాదైనా ఎంట్రీ ఉంటుందా?

సారాంశం

నందమూరి వారసుడు మోక్షజ్ఞ బర్త్ డే వేడుకలు బాలయ్య నిర్వహించాడు. ఈ సందర్భంగా కనీసం ఈ ఏడాదైనా మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

నేడు మోక్షజ్ఞ తన 28వ బర్త్ డే జరుపుకున్నారు. బాలయ్య 107వ చిత్ర సెట్స్ లో మోక్షజ్ఞ బర్త్ డే వేడుకలు బాలయ్య నిర్వహించాడు. దర్శకుడు గోపీచంద్ మలినేని, హీరోయిన్ శృతి హాసన్, సప్తగిరి తో పాటు యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలయ్య దంపతులు కొడుకు మోక్షజ్ఞ చేత కేక్ కట్ చేయించి ప్రేమగా తినిపించారు. బాలయ్య కంటే మంచి హైట్ ఉన్న మోక్షజ్ఞ మనసు పెడితే మంచి హీరో మెటీరియల్ కావడం ఖాయం. చాలా అరుదుగా బయటకనిపించే మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా మీడియా కంట పడ్డారు. 

ప్రపంచవ్యాప్తంగా బాలయ్య అభిమానులు మోక్షజ్ఞ బర్త్ డే వేడుకలు నిర్వహించారు. సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విషెస్ తెలియజేశారు. అయితే వాళ్ళు తీవ్ర నిరాశలో ఉన్నారు. ముప్పైకి దగ్గరవుతున్న మోక్షజ్ఞ హీరో అయ్యేదెప్పుడని చింతిస్తున్నారు. మోక్షజ్ఞ టీనేజ్ దాటక ముందే ఫ్యాన్స్ హీరో కావాలంటూ గోల మొదలుపెట్టారు. దశాబ్ద కాలంగా వాళ్ళ గోడు పట్టించుకున్న నాథుడు లేడు. మోక్షజ్ఞకు అసలు హీరో అయ్యే కోరిక లేకపోవడమే ఆలస్యానికి కారణమని తెలుస్తోంది. మోక్షజ్ఞ మనసు మార్చాలని బాలయ్య సైతం శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాడు. 

మరోవైపు ప్రతి ఏడాది ఇదుగో ఎంట్రీ అడుగో డైరెక్టర్ అంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.  అనిల్ రావిపూడి,  బోయపాటి, పూరి జగన్నాద్ ఇలా అనేక మంది స్టార్ డైరెక్టర్స్ పేర్లు తెరపైకి వచ్చాయి. గత ఏడాది బాలయ్య మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని గట్టిగా చెప్పారు. ప్రతి ఏడాది ఇలానే గడిచిపోతుండగా, ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

సూపర్ హిట్ కావాల్సిన ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాలు అట్టర్ ఫ్లాప్..కృష్ణంరాజు సెంటిమెంట్ వల్లే కొంప మునిగిందా ?
Giri Babu: నమ్మించి మోసం చేశారు.! చిరంజీవి 'కొదమ సింహం' మూవీ వల్ల రూ. 20 లక్షలు నష్టపోయా