భగవంత్ కేసరితో సెంచరీ కొట్టిన బాలయ్య.. అనిల్ రావిపూడి ఇలా అనేశాడంటేంటి...?

By Mahesh JujjuriFirst Published Jan 26, 2024, 8:15 PM IST
Highlights

బాలయ్య బాబు భగవంత్ కేసరి సినిమా రేర్ ఫీట్ ను సాధించింది. ఎంత పెద్ద సినిమా అయినా రెండు వారాలు కూడా ఆడని ఈరోజుల్లో బాలయ్య మాత్రం సెంచరీ కొట్టి చూపించాడు. 
 


నందమూరి నట సింహం బాలయ్యబాబు హీరోగా.. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా.. యంగ్ స్టార్ టాలెంటెడ్ లేడీ శ్రీలీల ఇంపార్టెంట్ రోల్ చేసిన సినిమా భగవంత్ కేసరి. ఎంత పెద్ద సినిమా అయినా... ఎంత పెద్ద స్టార్ అయినా..ఎంత భారీ బడ్జెట్ పెట్టినా.. పట్టుమని రెండు వారాలుకూడా ఆడటం లేదు సినిమాలు అంటువంటి సమయంలో .. భగవంత్ కేసరి సినిమా  విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశాడు. 

ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. మా సినిమాపై అమితమైన ప్రేమ కురిపించిన ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. భగవంత్ కేసరి షూటింగ్ టైంలో మాకు సహకరించి.. మధురమైన జ్ఞాపకాలు అందించిన మై హీరో నందమూరి బాలకృష్ణకు ధన్యవాదాలు. అద్బుతమైన కమిట్‌మెంట్‌తో ఈ ప్రయాణాన్ని ఎప్పటికీ మరిచిపోకుండా చేసిన నా యూనిట్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మీకు, నాకు, మనందరికీ ఈ సినిమా శానా ఏండ్లు యాదుంటది.. అంటూ ఈ సినిమాలో బాలయ్య చెప్పిన డైలాగ్ ను స్పెషల్ గా  ట్వీట్ చేశాడు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Latest Videos

 

❤️‍🔥

A heartfelt thank you to the audience for embracing our film with so much love 🙏🏻

Forever grateful to my HERO, garu for all the humongous support and cherished memories during the shoot of 🤗

A special… pic.twitter.com/7YmpWcyIuf

— Anil Ravipudi (@AnilRavipudi)

భగవంత్ కేసరి గ్రాండ్ సక్సెస్‌ తో దిల్ ఖుష్ అయ్యారు టీమ్. అనిల్ రావిపూడి ఇమేజ్ కూడా ఈసినిమాతో ఇంకాస్త పెరిగింది అనుకోవాలి. ఈమూవీని ఇంత సక్సెస్ చేసినందుకు..అద్భుతంగా తెరకెక్కించినందుకు  డైరెక్టర్ అనిల్‌ రావిపూడికి ఇప్పటికే నిర్మాత సాహు గారపాటి Toyota Vellfire కారును బహుమతిగా అందించారు. ఈ చిత్రాన్ని ఓవర్సీస్‌లో పాపులర్ లీడింగ్ డిస్ట్రిబ్యూషన్‌ హౌజ్‌ సరిగమ సినిమాస్ విడుదల చేయగా.. అక్కడ కూడా సూపర్ కలెక్షన్లు రాబట్టింది. 

బాలీవుడ్ యాక్టర్‌ అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించిన ఈమూవీలో తమిళ స్టార్ యాక్టర్  శరత్‌కుమార్‌, రఘుబాబు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని షైన్‌ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హ‌రీష్ పెద్ది నిర్మించగా.. ఎస్‌ థమన్‌  తన మార్క్ మ్యూజిక్‌ తో మ్యాజిక్ చేశారు. ఇక బాలయ్య ఫైట్ సీన్స్ కు డైలాగ్స్ సీన్స్ కు అదరిపోయే  బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందించాడు. ఈసినిమాలో ఉయ్యాలో.. ఉయ్యాలో పాటకు వచ్చిన రెస్పాన్స్ గురించి మీకు అందరకిి తెలిసిందే..? 

click me!