
వరుస సినిమాలతో జోరు మీద ఉన్న బాలయ్య.. నెక్ట్స్ సినిమా అనిల్ రావిపూడితో చేయబోతున్నాడు. ఇక ఈసినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి.
బాలకృష్ణ అఖండ జోరుతో వరుసగా సినిమాలకు సైన్ చేస్తున్నారు. ఇక అటు బాలయ్యతో సినిమా చేసే ఛాన్స్ కోసం అనిల్ రావిపూడి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు. అసలు బాలయ్య బాబు 100వ సినిమానే తాను చేయాలనుకున్నానని గతంలో వెల్లడించాడు అనిల్ కానీ కొన్ని కారణాల వలన అది కుదరలేదు. ఆ తరువాత ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీ అయ్యారు.
ఇక ఈ మధ్యనే బాలకృష్ణకి అనిల్ ఒక అద్భుతమైన కథ చెప్పి మెప్పించాడట. దాంతో బాలయ్య బాబు ఓకే చెప్పడం కూడా జరిగిపోయిందట. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేస్తున్నారు. ఇది బాలకృష్ణకి 107వ సినిమా. రాయలసీమ నేపథ్యంలో సాగే పవర్ ఫుల్ కథతో సినిమా చేస్తున్నాడు బాలయ్య.
ఈ సినిమా తరువాత ఆయన అనిల్ రావిపూడితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు బాలకృష్ణ. ఇక ఈసినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఈసినిమా కథ ఇప్పటి వరకు బాలయ్య చేయనంత కొత్తగా ఉంటుందట. ఆయన క్యారెక్టరైజేషన్ కూడా కొత్తగా డిజైన్ చేశాడట అనిల్. ఈ సినిమాలో 14 ఏళ్లు జైలు శిక్షను అనుభవించి వచ్చిన ఒక నేరస్థుడి పాత్రను బాలయ్య కనిపించబోతున్నట్టు సమాచారం.
ఇక అందరు సీనియర్లకు వచ్చిన ఇబ్బందే బాలయ్య సినిమాకు వచ్చింది. హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలి అనే కన్ ఫ్యూజన్ లో ఉన్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య జోడీగా యంగ్ హీరోయిన్ మెహ్రీన్ నటించబోతున్నట్టు టాక్ గట్టిగా నడుస్తోంది. ఫస్టాఫ్ అంతా కూడా బాలయ్య మార్కు యాక్షన్ తోను .. సెకండాఫ్ అంతా కూడా అనిల్ మార్కు కామెడీతోను ఈ కథ నడుస్తుందని తెలుస్తోంది.
ఈ సినిమా నుంచి మరో భారీ అప్ డేట్ ఏంటంటే.. మాస్ మహారాజ్ రవితేజ అతిథి పాత్రను పోషించనున్నారని చెబుతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా త్వరగా స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ఎఫ్3 రిలీజ్ అవ్వగానే అనిల్ ఫ్రీ అవుతాడు, బాలయ్య కూడా గోపీచంద్ మలినేని సినిమాను ఫాస్ట్ గా కంప్లీట్ చేసి.. అనిల్ ప్రాజెక్ట్ లో జాయిన్ అవ్వాలని చూస్తున్నాడు.