NBK 107: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని ఎంత పెద్ద ప్లాన్ వేశారో తెలుసా ?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 10, 2022, 05:06 PM IST
NBK 107: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని ఎంత పెద్ద ప్లాన్ వేశారో తెలుసా ?

సారాంశం

2021 చివర్లో టాలీవుడ్ బాక్సాఫీస్ కి మంచి జోష్ ఇచ్చిన చిత్రం అఖండ. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం కళ్ళు చెదిరే విజయం సాధించింది. బాలయ్య కెరీర్ లోనే ఈ మూవీ హైయెస్ట్ గ్రాస్ రాబట్టింది. 

2021 చివర్లో టాలీవుడ్ బాక్సాఫీస్ కి మంచి జోష్ ఇచ్చిన చిత్రం అఖండ. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం కళ్ళు చెదిరే విజయం సాధించింది. బాలయ్య కెరీర్ లోనే ఈ మూవీ హైయెస్ట్ గ్రాస్ రాబట్టింది. దీనితో బాలయ్య ఫుల్ జోష్ తో 2022లోకి అడుగుపెట్టేశాడు. బాలకృష్ణ తదుపరి చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. 

ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే కన్నడ క్రేజీ నటుడు దునియా విజయ్ విలన్ రోల్ పోషించబోతున్నారు. వీరిద్దరూ NBK 107 లో నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 

తాజాగా ఈ చిత్రం గురించి క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకోసమే వివిధ భాషల్లో పాపులర్ అయిన వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ లాంటి నటుల్ని ఎంపిక చేసుకుంటున్నారట. 

గోపీచంద్ ఈ చిత్ర కథని వాస్తవ సంఘటనల ఆధారంగా సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇది పాన్ ఇండియా చిత్రమా కాదా అనే విషయంపై చిత్ర యూనిట్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. 

ఒకవైపు గోపీచంద్ మలినేని క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ తో.. మరోవైపు బాలయ్య అఖండ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. దీనితో NBK 107పై ప్రారంభం నుంచే భారీ అంచనాలు మొదలయ్యాయి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తమన్ సంగీత దర్శకుడు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే