బాలయ్య - బోయపాటి కాంబినేషన్ లో సినిమా అంటే అది ఏ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయో అందరికి తెలుసు. ఇద్దరు కలిసి హ్యాట్రిక్ కొట్టి అద్భుతం చేశారు. ఇక నాలుగో సారి ఈ కాంబో సందడి చేయబోతోంది.
బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో సినిమా అంటే ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేస్తాయి. గతంలోవీరి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇద్దరు కలిసి హ్యాట్రిక్ హిట్ కొట్టారు. వీరి కాంబోలో వచ్చిన 'అఖండ సినిమా రీసెంట్ గా రెండేళ్లు కప్లీట్ చేసుకుంది. బాలకృష్ణ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచింది. మాస్ యాక్షన్ ను లింక్ చేస్తూ ఫ్యామిలీ డ్రామాను నడిపించడంలో బోయపాటికి మంచి పేరు ఉంది. వాటికి తోడు ఈ కథలో దైవశక్తిని కూడా యాడ్ చేయడం మరింతగా కలిసొచ్చింది.
ఇక ఈసినిమాకు సీక్వెల్ ఉంటుంది అని బోయపాటి అప్పుడెప్పుడో ప్రకటించారు. కాని ఇప్పటి వరకూ ఆ సినిమాపై ఎటువంటి అప్ డేట్ ఇవ్వలేదు. అఖండ తరువాత బోయపాటి చేసిన 'స్కంద' ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో మళ్లీ బాలయ్యతోనే సినిమా చేసి హిట్ కొట్టాలి అని అనుకుంటున్నాడు. అందుకే బోయపాటి ప్రస్తుతం 'అఖండ 2'కి సంబంధించిన కథను రెడీ చేసుకుంటున్నాడని అంటున్నారు. '
కథపై కసరత్తులు చేస్తున్నాడట బోయపాటి. అఖండ'లోని పాయింటును పట్టుకునే సీక్వెల్ కూడా ముందుకు వెళుతుంది. ఈ విషయాన్ని గతంలోనే బోయపాటి చెప్పాడు. ఇక ప్రస్తుతం బాలయ్య .. బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తరువాతనే ఆయన బోయపాటి ప్రాజెక్టుపైకి వెళ్లవలసి ఉంటుంది. అయితే ఈమధ్యలో బోయపాటి అల్లు అర్జున్ తో సినిా చేయాల్సి ఉంది. కాని బన్నీ పుష్ప 2 హడావిడి అయ్యేదాకా ఇంకే సినిమా వైపు చూడడు.
పుష్ప తరువాత బోయపాటితో చేస్తాడా లేక హిట్ ఫామ్ లో ఉన్న సందీప్ రెడ్డితో అల్లు అర్జున్ సినిమ చేస్తాడా అనేది తేలాల్సి ఉంది. అయితే ఈలోపు బోయపాటి.. 'అఖండ 2' కథ రెడీ చేసి పెట్టుకుంటే..బన్ని టైమ్ ఇవ్వకున్నా.. బాలయ్యతో అనుకున్న సమయానికి సినిమా మొదలెట్టవచ్చుక అని చూస్తున్నాడు. మరి బోయపాటి అఖండ 2తో హిట్ ఇస్తాడా..? అసలు ఈసినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. త్వరలో అప్ డేట్ ఇవ్వాలని ప్లాన్ లో ఉన్నారట బోయపాటి టీమ్. మరి ఇస్తారా ఇవ్వరా అనేది చూడాలి.