CID:ఫలించని డాక్టర్ల ప్రయత్నాలు, గుండె పోటుతో CID నటుడు దినేష్ మృతి

Published : Dec 05, 2023, 02:06 PM IST
CID:ఫలించని డాక్టర్ల ప్రయత్నాలు, గుండె పోటుతో  CID నటుడు దినేష్ మృతి

సారాంశం

కొంత కాలంగా హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న సీఐడి నటుడు దినేష్ ఫడ్నిస్ కన్నుమూశారు. ఆయన మరణ వార్త బాలీవుడ్ లో విషాదాన్ని నింపింది.   

దేశ వ్యాప్తంగా CID సీరియల్ కు ఎంత ప్రేక్షకాదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసీరియల్ హిందీతో పాటు తెలుగు ప్రజల మనసులు కూడా దోచింది. ఇందులో నటించే ప్రతీ ఒక్కరు అందరికి ఫేవరేట్ అయ్యి ఉంటారు. ముఖ్యంగా ఈ సీరియల్ లో కామెడీ ఆఫీసర్  ప్రణీత్ గా ఫేమస్ అయ్యారు దినేష్ ఫడ్నీస్. ఆయన ఈరోజు ఉదయం మరణించారు. ఐదు రోజుల క్రితం గుండె పోటుకు గురైన దినేష్.. హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. పరిస్థితి విషమంగా ఉంది అని మొదటి నుంచీ డాక్టర్లు చెపుతూనే ఉన్నారు. వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్న దినేష్.. పరిస్థితి విషమించడంతో మరణించారు. 

తన ఎక్స్ ప్రెషన్స్ తో , కామెడీ టైమింగ్ తో నవ్వించేవారు దినేష్. భయంకలిగిన ఆఫీసర్ గా.. ఆయన యాక్టింగ్ అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా డాక్టర్ రాహుల్ తో ప్రణీత్ క్యారెక్టర్ లో దినేష్ సీన్స్ అద్బుతంగా పండాయి. ఇక హస్పిటల్ లో ఉన్న దినేష్ కోసం.. సీఐడీ యాక్టింగ్ టీమ్ చాలా కష్టపడ్డారు. ఆయన్ను బ్రతికించుకోవడం కోసం.. ఈ నటులలో ఒకరైన  సీఐడీలో దయా పాత్రను పోషించిన దయానంద్ శెట్టి దగ్గరుండి చూసుకున్నారు. కాని దినేష్ పరిస్థితి విషమించడంతో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. 

దినేష్ మరణంతో బాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. హిందీ టెలివిజన్ తారలు ఆయన మృతికి సంతాపాలు ప్రకటిస్తున్నారు. గుండె పోటుతో డిసెంబర్ 1న ముంబయ్ లోని తుంగా హాస్పిటల్ లో చేరిన ఆయన గత రాత్రి 12 గంటలకు మరణించారు. ఇక దినేష్ అంత్యక్రియలు  బోరీవాలీలోని దౌలత్ స్మశాన వాటికలో ఈరోజు జరగబోతున్నాయి. 

టెలివిజన్ చరిత్రలో సంచలనం సృష్టించిన సీరియల్ అంటే ముందు వరసలో CID ఉంటుంది.  బుల్లితెర పై లాంగ్ టైమ్ ప్లే అయిన సీరియల్ కూడా CIDనే.  విశేష ప్రజాదరణ  ఆదరణ పొందిన సీరియల్ ఏదీ అంటే ఠక్కున CID పేరు వస్తుందతి. అలా ఆడియన్స్ ను అరిస్తూ వచ్చిన ఈసీరియల్ హిందీతో పాటు.. తెలుగులో కూడా ఈసీరియల్ కు మంచి ఆదరణ ఉంది.  అంతలా ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేసిన క్రైమ్ అండ్ సస్పెన్షనల్ టీవీ సిరీస్ సీఐడీ. మరీ ముఖ్యంగా  చిన్న పిల్లలకు ఇదిఫ్యావరేట్  సీరియల్.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి