
వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’. తెలుగు-హిందీ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని శక్తి ప్రతాప్ సింగ్ హడా డైరక్ట్ చేసారు. ‘సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్’, ‘సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్’ ‘గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్’ (వకీల్ ఖాన్) సంస్థల పై సిద్దు ముద్ద, నందకుమార్ అబ్బినేని నిర్మించారు. రుహాని శర్మ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. మార్చి 1న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో మొదటి రోజు ఓకే అనిపించే ఓపినింగ్స్ తెచ్చుకుంది. రెండో రోజు ముందు డ్రాప్స్ ఎక్కువగానే ఉన్నా కూడా ఓవరాల్ గా…
పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ తో వీకెండ్ పూర్తైంది. సినిమా కి క్లాస్ సెంటర్స్ మల్టీప్లెక్సులలో పర్వాలేదు అనిపించేలా ఆక్యుపెన్సీ ఉండగా… మాస్ సెంటర్స్ లో మాత్రం సినిమా బుకింగ్స్ దారుణంగా ఉన్నాయనే చెప్పాలి.
ఇక ఈ చిత్రం హిందీ వెర్షన్ విషయానికి వస్తే ...ప్యాన్ ఇండియా సినిమాగా ప్రమోట్ చేయటంతో అక్కడ భాక్సాఫీస్ పై చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ హిందీ మాట్లాడే ఏరియాల్లో ఈ సినిమా మినిమం కూడా వసూలు చేయలేకపోతోందని బాలీవుడ్ భాక్సాఫీస్ రిపోర్ట్ . అక్కడ మొదటి రోజు కేవలం 20 లక్షలు మాత్రమే వచ్చాయని, మొత్తం మీద వీకెండ్ అంతా కలిపి కోటి కూడా వసూలు చేయలేకపోయిందనేది ప్రాధమిక అంచనా. ఇక్కడ తెలుగులోనూ చెప్పుకోదగిన కలెక్షన్స్ లేవు. అక్కడ హిందీలోనూ అదే పరిస్దితి కావటంతో సినిమా బ్రేక్ ఈవెన్ అవటం కష్టమే అని తేల్చేస్తోంది ట్రేడ్.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా మీదే పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. ఫిబ్రవరిలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం వివిధ కారణాల వల్ల వాయిదా పడి చివరికి మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పుల్వామా ఉగ్రదాడి, భారత వాయుసేన ఎయిర్ స్ట్రైక్ నేపథ్యంలో తీసిన సినిమా ఇది. రూ.50 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. వరుణ్ తేజ్ మార్కెట్ ప్రకారం ఇది కాస్త రిస్కే. కానీ రిలీజ్‌కి ముందే ఈ సినిమా సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయిందని చెప్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ మొత్తాన్ని ప్రీ రిలీజ్ బిజినెస్‌తోనే రాబట్టేశారు మేకర్స్. దాంతో సినిమా విడుదలకు ముందే మేకర్స్ ప్రాఫిట్ జోన్‌లో ఉన్నారు.
ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ (అన్ని భాషల్లో) రూ.26 కోట్లకి సొంతం చేసుకుంది. ఇక హిందీ హక్కులు (నాన్-థియేట్రికల్) రూ.14 కోట్లకి అమ్ముడయ్యాయి.
అలానే ఆపరేషన్ వాలెంటైన్ మ్యూజిక్ రైట్స్ రూ. 2.6 కోట్లకి సేల్ అయ్యాయి. ఇక తెలుగు శాటిలైట్ డీల్ రూ. 6.5 కోట్లకి క్లోజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ లెక్కల బట్టి ఇప్పటికే దాదాపు రూ.50 కోట్లు వసూలు చేసేసింది మూవీ టీమ్. ఇలా నిర్మాతలు నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా బడ్జెట్ మొత్తాన్ని రికవరీ చేసేశారు.