
టాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి ఎదిగాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ తో ప్రపంచ వ్యాప్తంగా ఇమేజ్ సాధించుకున్న యంగ్ హీరో.. ఏదో ఒక రికార్డ్ సాధిస్తూనే ఉన్నారు. ఇప్పికే ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ.. సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తూ.. వస్తున్న చరణ్. ప్రస్తుతం మరో రేర్ ఫీట్ సాధించాడు. అందులో బాలీవుడ్ స్టార్ హీరోలను.. సౌత్ సీనియర్ హీరోలను సైతం పక్కకు నెట్టి.. ముందు వరుసలో నిలుచున్నాడు ఇంతకీ అతను సాధించిందేమిటంటే..?
ప్రముఖ సినీ వెబ్ సైట్ IMDB ప్రతి వారం, ప్రతి నెల, ప్రతీ ఏడాది.. ఇండియాలో టాప్ స్టార్స్ లిస్ట్ ఇస్తుంది. ఫ్యాన్స్ ఓటింగ్ తో పాటు స్టార్స్ కు ఉన్న పాపులారిటీ, ఇమేజ్.. దానితో పాటు ఆ హీరోల యాక్టివిటీలను బట్టి IMDB ఈ లిస్ట్ ని రిలీజ్ చేస్తుంది. టాప్ 10 హీరోల లిస్ట్ ఇస్తుంది IMDB. అయితే ఈ సర్వేలో.. గత కొన్నాళ్లుగా రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా ఉంటున్నారు. కాని ఈ టాప్ 10 లిస్ట్ లో ఏదో ఒక ప్లేస్ లో వారు ఉంటూ వస్తున్నారు. ఇక తాజాగా ఈ వారం రిలీజ్ చేసిన లిస్ట్ లో బాలీవుడ్ స్టార్స్ షారుఖ్, సల్మాన్ లను దాటి మరీ రామ్ చరణ్ మొదటి ప్లేస్ సాధించాడు.
ఈ లిస్ట్ లో రామ్ చరణ్ మొదటి ప్లేస్ లో నిలవగా బాలీవుడ్ భామ యామి గౌతమ్ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. షారుఖ్ మూడో ప్లేస్, దీపికా పదుకొనే నాలుగోవ స్థానం సాధించింది. ఇక బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ అయితే..అయిదవ స్థానంతో సరిపెట్టుకున్నారు. ఇక టాలీవుడ్ స్టార్.. ఎన్టీఆర్ ఆరవ స్థానం, ఐశ్వర్యరాయ్ ఏడవ స్థానం, రాశిఖన్నా ఎనిమిదవ స్థానం, అమీర్ ఖాన్ తొమ్మిదవ స్థానం, సన్నీ కౌశల్ పదవ స్థానంలో నిలిచారు.
ఇక ఇంత మంది స్టార్స్ మధ్య మన రామ్ చరణ్ ఫస్ట్ ప్లేస్ సాధించడంతో.. చరణ్ అభిమానులతో పాటు మెగా జనాలు దిల్ ఖుష్ అవుతున్నారు. ఇక రీసెంట్ గా ఓగెస్ట్ రోల్ లో మెరిశాడు రామ్ చరణ్. సల్మాన్ ఖాన్ కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమాలో ఓ సాంగ్ కోసం చరణ్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. దాంతో ఈ సాంగ్ తెగ వైరల్ అయ్యింది. ఈ సాంగ్ లో చరణ్ సల్మాన్ ఖాన్, వెంకటేష్ లతో కలిసి లుంగీ డ్యాన్స్ తో అదరగొట్టారు.