మందులు కూడా కొనలేని స్థితిలో `బలగం` నటుడు, ఆర్థిక సాయం కోసం ఎదురుచూపు

Published : May 21, 2025, 11:31 AM IST
balagam actor gv babu

సారాంశం

`బలగం` చిత్రంలో ప్రియదర్శి చిన్న తాతగా నటించిన నటుడు జీవీ బాబు పరిస్థితి విషమంగా ఉంది. మందులు కూడా కొనలేని దీనస్థితిలో ఉన్నారు. దాతల కోసం వేచి చూస్తున్నారు. 

`బలగం` సినిమా తెలంగాణ నేపథ్యంలో వచ్చిన చిత్రాల్లో ఒక ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. తెలంగాణ కల్చర్‌ని యదాతథంగా ప్రతిబింబించిన మూవీ. తెలంగాణ రూట్లని వెండితెరపై ఆవిష్కరించిన మూవీ. కమెడియన్‌ వేణు ఎల్దండి దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం. 

ఇందులో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా, కావ్య కళ్యాణ్‌ రామ్‌ ఆయనకు జోడీగా చేసింది. రూప లక్ష్మి, మురళీధర్‌ గౌడ్‌, సుధాకర్‌రెడ్డి, వేణు, రచ్చ రవి ముఖ్య పాత్రలు పోషించారు.

కిడ్నీల సమస్యతో బాధపడుతున్న `బలగం` నటుడు జీవీ బాబు

రెండేళ్ల క్రితం వచ్చిన `బలగం` చిత్రం పెద్ద హిట్‌ అయ్యింది. తెలంగాణ కల్చర్‌ నేపథ్యంలో వచ్చిన చిత్రాలకు ఒక ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఇందులో ప్రియదర్శికి చిన్నతాత అంజన్నగా నటించాడు జీవీ బాబు. 

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమించింది. ఆయనకు కిడ్నీలు దెబ్బతిన్నాయి. గొంతుకి ఇన్‌ఫెక్షన్‌ రావడంతో నోట మాట రావడం లేదు. చాలా రోజులుగా ఆయనకు డయాలసిస్‌ చేస్తున్నారు. దీంతో ఆసుపత్రి బిల్లు చెల్లించలేని పరిస్థితి నెలకొంది.

మందులు కూడా కొనలేని దీనస్థితిలో `బలగం` నటుడు

జీవీ బాబు ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది. బలగం వేణు, ప్రియదర్శి వంటివారు సహాయం చేసినా అవి  ఆసుపత్రి ఖర్చులకు కూడా చాలడం లేదు. ఇప్పుడు కనీసం మందులు కూడా కొనలేని దీనస్థితికి చేరుకున్నారు. దీంతో తమకు సహాయం చేయాలని, ఆదుకోవాలని వారి కుటుంబ సభ్యులు ప్రాదేయపడుతున్నారు. దాతల కోసం వేచి చూస్తున్నారు.

ప్రియదర్శి చిన్నతాతగా ఆకట్టుకున్న జీవీ బాబు

`బలగం` చిత్రంలో ప్రియదర్శి చిన్న తాతగా అంజన్న పాత్రలో జీవీ బాబు అదరగొట్టారు. ప్రియదర్శి తాత చనిపోవడంతో ఆ తర్వాత జీవీ బాబు పాత్ర కీలకంగా మారుతుంది. కథని ముందుకు తీసుకోవడంలో ఆయన పాత్ర కీలక పాత్ర పోషిస్తుంది. 

ఈ పాత్రలో జీవీ బాబు జీవించారు. ఊర్లో తాతలు ఎలా ఉంటారో అలానే సహజంగా నటించి మెప్పించారు, అందరి దృష్టి ఆకర్షించారు. ఇప్పుడు ఆయన దీనస్థితిలో ఉండటం విచారకరం.

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?