బాహుబలి 2 వీడియో లీక్

Published : Nov 22, 2016, 07:27 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
బాహుబలి 2 వీడియో లీక్

సారాంశం

బాహుబలి 2 వీడియో లీకేజ్ వాట్సాప్ లో వైారల్ అయిన బాహుబలి 2 లీక్ వీడియో ఎడిటింగ్ రూం నుంచేే లీకైనట్లు అంచనా

బాహుబలి2 లీకేజ్ తో మరోసారి షాక్ కి గురైంది టాలీవుడ్. ఎడిటింగ్ టేబుల్ నుంచే ఈ లీకేజీ జరిగినట్లు ప్రాధమిక అంచనాకు వస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న బాహుబలి 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్నది సప్సెన్స్ గా మారింది.  

 

ఈ  దశలో ప్రొస్ట్  ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. కానీ ఇంతలో బాహుబలి2కి సంబంధించిన ప్రభాస్, అనుష్క సినిమాకు సంబంధించిన లుక్స్ లీక్ కావడంతో చిత్ర యూనిట్ టెన్షన్ పడుతోంది.  

 

బాహుబలి1 సమయంలో కూడా లీకేజీ తో గజగజ వణికి పోయింది జక్కన్న టీమ్. 8నిముషాల నిడివి ఉన్న వీడియో లీకైనా... సీజీ వర్క్ లేని ఫూటేజీ కావడంతో.. సినిమా పై పెద్ద ప్రభావం పడలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. శంకర్ లాంటి దర్శకుడు కూడా బాహుబలి 2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చాడు.

 

రెండో భాగం షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి రాజమౌళి చాలా జాగ్రత్తలుతీసుకున్నాడు. ఎలాంటి లీకేజీ కి అస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. టీమ్ కి స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడు. అయినా..ఇప్పుడు జరగాల్సిన నష్టం జరిగింది.

 

PREV
click me!

Recommended Stories

OTT: పూజ ఎవ‌రు? ఆ ప‌ర్సుతో ఆమెకు సంబంధం ఏంటి.? ఓటీటీని షేక్ చేస్తున్న మిస్ట‌రీ క్రైమ్ థ్రిల్ల‌ర్
Dhandoraa First Review: శివాజీ 'దండోరా' మూవీ ఫస్ట్ రివ్యూ.. కాంట్రవర్షియల్ కథతో బ్లాక్ బస్టర్ కొట్టేశారా ?