
కరోనాకు గురైన సీనియర్ నటుడు సత్యరాజ్ కోలుకున్నాడు. ఇటీవల కరోనా corona బారిన పడ్డ ఆయన చైన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. చికిత్స పొందుతున్న క్రమంలో ఆరోగ్యం కాస్త క్షీణించడంతో అభిమానులు కాస్త కంగారు పడ్డారు. చివరికి పూర్తిగా కరోనా నుంచి విముక్తి పొందాడు సత్యరాజ్. దీంతో ఈ ఉదయం ఇంటికి చేరుకున్నట్టు సమాచారం.
సత్యరాజ్ ఎన్నో చిత్రాల్లో నటించినా తెలుగు ప్రేక్షకులకు మాత్రం బహుబలిలో కట్టప్పగానే ఎక్కువగా గుర్తుండి పోతారు. అంతకు ముందు, ఆ తర్వాత నటించిన చిత్రాలూ ఆయనికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. సత్యరాజ్ ఆరోగ్యంగా ఉన్నారనే సమాచారంతో అభిమానులు సంతోషం వ్యక్త చేస్తున్నారు. మున్ముందు మరిన్ని మూవీస్ లో ఆయన్ని చూడాలని ఆకాంక్షిస్తున్నారు.
అయితే సత్యరాజ్ చిత్రాల్లో నడించడమే కాకుండా సోషల్ యాక్టివిస్ట్ గా ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. ఈయన తన సినీ ప్రస్థానాన్ని తొలుత విరోధమైన పాత్రల్లో నటించినా ఆ తర్వాత తన నటనా ప్రావీణ్యంతో లీడ్ రోల్స్ చేశారు. తెలుగు చిత్రాల్లో సత్యరాజ్ కు మిర్చి, బహుబలి, ప్రతిరోజూ పండగే చిత్రలతో తనకు మంచి గుర్తింపు, ప్రేక్షక ఆదరణ లభించింది. ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ ఫేర్ అవార్డులు, ఉత్తమ యాక్టర్ గా ఆనంద వికటన్ సినిమా ఆవార్డ్స్ ను అందుకున్నారు.