'బద్లా' ట్రైలర్.. తాప్సీ మరో హిట్టు కొట్టేలా ఉందే!

Published : Feb 12, 2019, 02:11 PM IST
'బద్లా' ట్రైలర్.. తాప్సీ మరో హిట్టు కొట్టేలా ఉందే!

సారాంశం

తెలుగులో హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించిన తాప్సీ బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో ముంబైకి షిఫ్ట్ అయింది. సరికొత్త కథలను ఎన్నుకుంటూ హిట్టు మీద హిట్టు అందుకుంటూ తన కెరీర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుంది. 

ప్రస్తుతం ఈ భామ 'బద్లా' అనే సినిమాలో నటిస్తోంది. అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్ ని తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. సుజాయ్ ఘోష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సస్పెన్స్, థ్రిల్లర్ గా తెరకెక్కించారు. వ్యాపారవేత్త అయిన ఓ మహిళ(తాప్సీ) మరో వ్యక్తితో కలిసి ఓ హోటల్ లో స్టే చేయాల్సివస్తుంది.

ఇంతలో ఆమెను ఎవరో తలపై బలంగా కొట్టగా స్పృహ కోల్పోతుంది. ఆమె లేచి చూసేసరికి తనతో పాటు వచ్చిన వ్యక్తి శవంగా పడి ఉంటాడు. కేసు హీరోయిన్ కి చుట్టుకోవడంతో పేరున్న లాయర్(అమితాబ్) సహాయం కోరుతుంది.

ఆ తరువాత ఏం జరిగిందనేదే సినిమా. ట్రైలర్ ని ఆసక్తికరంగా కట్ చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మార్చి 8న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
PREV
click me!

Recommended Stories

Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్
Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి నడిచొచ్చే కొడుకు.. రోహిణీ గతం బయటపడుతుందా? బాలుకి అబద్ధం చెప్పిన మీనా