పవన్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్... ఆ మూవీ రీ షూట్?

Published : Jul 18, 2021, 07:40 AM ISTUpdated : Jul 18, 2021, 07:42 AM IST
పవన్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్... ఆ మూవీ రీ షూట్?

సారాంశం

పవన్-రానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ పై భారీ అంచనాలున్నాయి. ముందుగా ఒప్పుకున్న సినిమాలను కూడా పక్కన బెట్టి అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ సెట్స్ పైకి తీసుకెళ్లారు పవన్ కళ్యాణ్. 

వకీల్ సాబ్ మూవీతో ఫ్యాన్స్ దాహం తీర్చాడు పవన్ కళ్యాణ్. మూడేళ్ళ నిరీక్షణ తరువాత ఆయన నుండి వచ్చిన వకీల్ సాబ్ విశేష ఆదరణ దక్కించుకుంది. లాయర్ సాబ్ గా పవన్ సరికొత్త అవతారంలో, తన మార్కు యాక్షన్, డైలాగ్స్ తో ఫ్యాన్స్ ని ఫిదా చేశారు. ఇక కమ్ బ్యాక్ తరువాత పవన్ కళ్యాణ్ వరుస చిత్రాలు ప్రకటించారు. వాటిలో మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ ఒకటి. 


పవన్-రానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ పై భారీ అంచనాలున్నాయి. ముందుగా ఒప్పుకున్న సినిమాలను కూడా పక్కన బెట్టి అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ సెట్స్ పైకి తీసుకెళ్లారు పవన్ కళ్యాణ్. దాదాపు విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రెండు పాత్రలు ప్రధానంగా సాగె అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ త్వరగా పూర్తి చేయాలని పవన్ భావించారు. అయితే ఈ మూవీ ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. 


ఈ మూవీకి కెమెరా మెన్ గా పనిచేస్తున్న ప్రసాద్ మూరెళ్ల ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. దర్శకుడికి, కెమెరా మెన్ కి వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆయన పవన్ సినిమాను వదులుకున్నారు. ఇప్పటికే కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు పవన్, రానా పై సన్నివేశాలు తెరకెక్కించారు. ప్రసాద్ మూరెళ్ళ చిత్రీకరించిన సన్నివేశాలు మరలా రీ షూట్ చేయాలని చిత్ర యూనిట్ బావిస్తున్నారట. 


ప్రసాద్ మూరెళ్ల తెరకెక్కించిన సన్నివేశాలు పట్ల పవన్ సైతం సంతృప్తి కరంగా లేరని, కథ టెంపో కూడా మారిపోయినట్లు అనిపిస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ప్రాజెక్ట్ కెమెరా మెన్ గా బాధ్యతలు తీసుకున్న రవి కే చంద్రన్ తో మరలా రీ షూట్ చేయాలనేది యూనిట్ ఆలోచనగా తెలుస్తుంది. ఆ విధంగా చూస్తే పవన్ మూవీ విడుదల ఆలస్యం కానుంది. 
 

PREV
click me!

Recommended Stories

దళపతి విజయ్ సినిమా లీక్ చేసింది ఎవరోతెలుసా..? ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. సంచలన నిజాలు
Sobhita Dhulipala: కష్టపడకుండా ఏడాదికి 10 కోట్ల రూపాయలు సంపాదిస్తున్న శోభిత.. ఎలాగో తెలుసా?