Baby Collections: `బేబీ` మూవీ రెండో రోజు కలెక్షన్లు.. బయ్యర్లు, నిర్మాతలకు పండగే..

Published : Jul 16, 2023, 04:10 PM ISTUpdated : Jul 16, 2023, 04:13 PM IST
Baby Collections: `బేబీ` మూవీ రెండో రోజు కలెక్షన్లు.. బయ్యర్లు, నిర్మాతలకు పండగే..

సారాంశం

`బేబీ` సినిమాని విజయవంతంగా రన్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్ల పరంగానూ దుమ్మురేపుతుంది. రెండు రోజుల్లో ఇది భారీ కలెక్షన్లని సాధించడం విశేషం.

`బేబీ` మూవీ ఇప్పుడు తెలుగులో చిన్న సినిమాల్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుంది. ఈ సినిమాకి ప్రీమియర్స్ నుంచి పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. కలెక్షన్ల పరంగానూ దుమ్మురేపుతుంది. ఈ సినిమా మొదటి రోజు ఏడు కోట్లకు పైగా కలెక్షన్లని రాబట్టింది. రెండో రోజు కూడా అదే మెయింటేన్‌ చేసింది. రెండు రోజుల్లో ఈ సినిమా ఏకంగా 14కోట్లు దాటింది(14.3కోట్లు). ఈ లెక్కన ఈ సినిమాకి దాదాపు ఎనిమిది కోట్ల షేర్‌ వచ్చిందని చెప్పొచ్చు. బ్రేక్‌ ఈవెన్‌కి బార్డర్ కి చేరుకుంది. `బేబీ` సుమారు ఏడున్నర కోట్లకి అమ్ముడు పోయిందని సమాచారం. ఈ లెక్కన ఇది బ్రేక్ ఈవెన్‌కి చేరుకుంది. 

అయితే నైజాంలో మాత్రం బ్రేక్ దాటేసిందని తెలుస్తుంది. నైజాంలో రెండు కోట్ల 54లక్షలతో బ్రేక్‌ ఈవెన్‌ దాటేసిందట. మిగిలిన చోట్ల బార్డర్‌కి చేరుకుందని, ఆదివారంతో కొన్న బయ్యర్లంతా లాభాల్లోకి వెళ్తారని తెలుస్తుంది. ఈ సినిమా లాంగ్‌ రన్‌లో ఇరవై కోట్ల(షేర్‌) దాటేసే అవకాశం ఉంది. ఈ రకంగా అటు నిర్మాతలు, కొన్న బయ్యర్లకి పండగే అని చెప్పొచ్చు. `బేబీ` అందరికి లాభాల పంట పండిస్తుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

దీనికి డిజిటల్‌ రైట్స్ అదనం. దాదాపు 8కోట్లకి `ఆహా` ఈ సినిమాని ఓటీటీ రైట్స్ ని దక్కించుకుందని తెలుస్తుంది. మొత్తానికి `బేబీ` నిర్మాతలకు భారీ లాభాలను తీసుకురాబోతుందని, ఈ ఏడాది పెద్ద హిట్‌ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు విశ్లేషకులు. బోల్డ్ కంటెంట్‌తో రూపొందింది `బేబీ`. లవ్‌ స్టోరీకి యువత పోకడలను మేళవించి రూపొందించారు దర్శకుడు సాయి రాజేష్‌. నేటి ట్రెండ్‌ని ఫాలో అవుతూ హార్ట్ టచ్చింగ్‌ డైలాగులు, పిచ్చెక్కించే సీన్లతో యువతకి కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాని తీర్చిదిద్దారు. 

దీనికి నటీనటులు వైష్ణవీ చైతన్య, ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌ నటన ప్లస్‌ అయ్యింది. అలాగే మ్యూజిక్‌ మరో పెద్ద బలం. కెమెరా వర్క్, నిర్మాత విలువలు ఇలా అన్నీ తోడయ్యాయి. అన్ని కలిసి ఈ సినిమాని పెద్ద హిట్‌ చేశాయని చెప్పొచ్చు. యువతకు నచ్చే అంశాలుండటంతో యూత్‌ దీనికి కనెక్ట్ అయ్యారు. వాళ్లే సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆనంద్‌, వైష్ణవి, విరాజ్‌ ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్‌ దర్శకత్వంలో మాస్‌ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్‌కేఎన్‌ నిర్మించిన `బేబీ` చిత్రం ఈ నెల 14న విడుదలైన విషయం తెలిసిందే. 

ఏరియా వైజ్‌ రెండో రోజుల కలెక్షన్ల వివరాలు..

AREA       GROSS
Nizam       5,08,16,396
Vizag         1,73,53,319
East             83,05,086
West           46,09,339
Krishna       74,99,963
Guntur        61,46,357
Nellore       37,77,814
Ceded      1,18,08,414
Karnataka +ROI     43,86,421
Overseas       2,84,00,000

TOTAL          14,31,03,109

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?