పుష్ప2 లో వివాదాల యాంకర్ దేవి నాగవల్లి.. నిజమెంత..?

Published : Jan 04, 2024, 11:39 AM IST
పుష్ప2 లో  వివాదాల యాంకర్ దేవి నాగవల్లి.. నిజమెంత..?

సారాంశం

పుష్ప2 లో వివాదాల యాంకర్ దేవి నాగవల్లి.. వినడానికి అవునా అనేవిధంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఈన్యూస్ వైరల్ అవుతోంది.  ఇంతకీ ఇందులో నిజం ఎంత..? 

టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమా  పుష్ప2.  దీనికి ముందు గా వచ్చిన పుష్ప  సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంత రచ్చ చేసిందో తెలిసిందే. ఈసినిమా వల్ల అల్లు అర్జున్ కు ఏకంగా జాతీయ అవార్డ్ వచ్చింది. పాన్ ఇండియా క్రేజ్ తో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా బన్నీకి పుష్ప సినిమాతో గుర్తింపు వచ్చింది. దాంతో పుష్ప 2ను అంతకు మించి తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు టీమ్. అందులో భాగంగా బన్నీతో పాటు  డైరెక్టర్ సుకుమార్ కూడా  ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. 

ఇక ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఇకపోతే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలకోసం టీవీ9 కాంట్రవర్షియల్ యాంకర్ దేవి నాగవల్లిను తీసుకోబుతున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు డైరెక్టర్ సుకుమార్  యాంకర్ దేవి నాగవల్లి నుంచి కొన్ని విషయాలు కూడా నేర్చుకుంటున్నారని సమాచారం. 

 ఈ సినిమాలో పుష్పరాజు మిస్ అయినప్పుడు ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్ ఇస్తూ ఉండే సన్నివేశాలు కూడా ఉన్నాయట. అయితే ఈ సన్నివేశాలను చేయడం కోసం సుకుమార్  యాంకర్ దేవి నాగవల్లిని సంప్రదించారట ఈ సినిమా కోసం ఆమెను సంప్రదించి కొన్ని సలహాలు సూచనలు కూడా అడిగారట అయితే సుకుమార్ రిక్వెస్ట్ కొద్ది దేవీ నాగవల్లి  అప్పుడప్పుడు షూటింగ్ కు వచ్చి...ఈసినిమా కోసం పనిచేశారని అని తెలుస్తోంది. 

అంతే కాదు పుష్ప 2 సినిమాలో యాంకర్  దేవి నాగవల్లి కూడా కనిపించబోతున్నారట. ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ న్యూస్ చదివే సీన్స్ లో కనిపిస్తారని అంటున్నారు. కాదు కాదు..  ఈమె న్యూస్ రీడర్ గా కాకుండా ఇంపార్టెంట్ సీన్స్ లో కనిపిస్తారని మరికొంత మంది అంటున్నారు. మరి దేవి నాగవల్ల ఎలా కనిపిస్తారో చూడాలి. పలు వివాదాల్లో ఫేమస్ అయ్యారు దేవి నాగవల్లి. యంగ్ హీరో విశ్వక్ సేన్ తో కొంత కాలం వివాదం నడిచింది. అంతే కాదు బిగ్ బాస్ 6 లో కూడా సందడి చేశారు దేవి. అందులో కూడా ఆమె కొన్ని వివాదాలతో వైరల్ న్యూస్ అయ్యారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Dec 10: అమూల్యకు విశ్వ ఉత్తరం.. నర్మద, ప్రేమ చేతికి చేరిన లెటర్
Aishwarya Rai: రెండు కోలుకోలేని తప్పులు చేసిన ఐశ్వర్యా రాయ్‌.. సౌత్‌లో రెండు ఇండస్ట్రీ హిట్లు మిస్‌