కౌశల్ గెలవడం నానికి ఇష్టం లేదు.. గోగినేని కామెంట్స్!

Published : Jan 23, 2019, 04:41 PM IST
కౌశల్ గెలవడం నానికి ఇష్టం లేదు.. గోగినేని కామెంట్స్!

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 2 షో అయిపోయి చాలా కాలమవుతోంది. ప్రేక్షకుల్లో కూడా ఈ ఫీవర్ తగ్గిపోయింది. ఇప్పుడు షో నిర్వాహకులు సీజన్ 3 కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

బిగ్ బాస్ సీజన్ 2 షో అయిపోయి చాలా కాలమవుతోంది. ప్రేక్షకుల్లో కూడా ఈ ఫీవర్ తగ్గిపోయింది. ఇప్పుడు షో నిర్వాహకులు సీజన్ 3 కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ లు బాబు గోగినేని, టైటిల్ విన్నర్ కౌశల్ మాత్రం ఇంకా గొడవ పడుతూనే ఉన్నారు.

హౌస్ లో ఉన్ననంత కాలం వీరిద్దరి మధ్య తగాదాలు జరుగుతూనే ఉండేవి. బయటకి వచ్చిన తరువాత కూడా ఒకరినొకరు మాటలతో దూషించుకున్నారు. రీసెంట్ గా జరిగిన సంక్రాంతి ఈవెంట్ లో కూడా ఇద్దరు ఒకరిపై ఒకరు అరుచుకుంటూ నానా రచ్చ చేశారు.

తాజాగా ఆస్ట్రేలియాలో జరిగిన ఓ వేడుకకు హాజరయ్యారు బాబు గోగినేని. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కౌశల్ విన్నర్ గా నిలవడం నానికి ఇష్టం లేదని బాబు గోగినేని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

బిగ్ బాస్ హౌస్ లో కౌశల్ కి వ్యతిరేకత ఏర్పడడంతో బయట పరిస్థితులు అతడికి అనుకూలంగా మారాయని, కౌశల్ కి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిని ట్రోల్ చేసేవారని అన్నారు. కౌశల్ ని విన్నర్ గా ప్రకటించాల్సి వచ్చిందని, కౌశల్ సేనని ఎదిరించలేక అతడికి టైటిల్ ఇచ్చారని.. ఇది నానికి అసలు ఇష్టం లేదని.. అందుకే విజేతను ప్రకటించే సమయంలో ఎంతో ఆలోచించారని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్‌తో చేసిన సినిమాల్లో అనుష్కకు నచ్చిన సినిమా ఏంటో తెలుసా.? అది భలే ఇష్టమట..
Karthika Deepam 2 Today Episode: సొంత తండ్రినే చంపేందుకు తెగించిన జ్యోత్స్న.. కార్తీక్‌ ఆమె ట్రాప్‌లో పడ్డడా?