కన్నడిగుల ఆందోళనలపై దిగొచ్చిన సత్యరాజ్..లేకుంటే రిలీజ్ అవుతుందా

Published : Apr 21, 2017, 09:36 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
కన్నడిగుల ఆందోళనలపై దిగొచ్చిన సత్యరాజ్..లేకుంటే రిలీజ్ అవుతుందా

సారాంశం

కావేరీ జలాల వివాదం సందర్భంగా కన్నడిగులకు వ్యతిరేకంగా సత్యరాజ్ కమెంట్స్ తొమ్మిదేళ్ల క్రితం సత్యరాజ్ చేసిన కమెంట్స్ ఇటీవల భగ్గుమన్న కర్ణాటక ప్రజా సంఘాలు బాహుబలి 2 రిలీజ్ పై ప్రభావం పడకుండా కన్నడిగులకు క్షమాపణలు చెప్పిన కట్టప్ప  

జక్కన్న రాజమౌలి తెరకెక్కించిన మాస్టర్ పీస్ బాహుబలి 2 ది కన్ క్లూజన్ కర్ణాటకలో రిలీజ్ కోసం గత కొంత కాలంగా పడుతున్న పురిటినొప్పులు.. కన్నడిగులకు కట్టప్ప సత్యరాజ్ క్షమాపణలు చెప్పడంతో ఫలితాన్నిచ్చాయి. కావేరీ జల వివాదం సమయంలో సత్యరాజ్ కన్నడిగుల మనోభావాలు దెబ్బతినేవిధంగా మాట్లాడాడనే ఆరోపణలతో గత కొంత కాలంగా బాహుబలి రిలీజ్ ను అడ్డుకుంటామని ప్రజా సంఘాలు కర్ణాటక వ్యాప్తంగా పెద్దయెత్తున ఆందోళనలకు దిగాయి. కట్టప్ప క్షమాపణలు చెప్తేనే కర్ణాటకలో సినిమా రిలీజ్ చేస్తామని చెప్పడంతో చేసేదేమీ లేక నిర్మాతలు నేరుగా రిలీజ్ చేద్దామని కూడా ఒక దశలో అనుకున్నారు.

 

అయితే దీనిపై స్పందించిన.. సత్యరాజ్ కన్నడిగులకు క్షమాపణలు చెప్తూ చిన్న వీడియో రిలీజ్ చేశాడు. తొమ్మిదేళ్ల క్రితం కావేరీ జలాల వివాదంలో తను చేసిన కమెంట్స్ బాహుబలి రిలీజ్ ను ఎఫెక్ట్ చేస్తున్నాయని తెలియడంతో సత్యరాజ్ క్షమాపణలు కోరుతూ వీడియో రిలీజ్ చేశారు. కన్నడిగులకు తాను వ్యతిరేకం కానే కాదని, గత 35 ఏళ్లుగా తన వ్యక్తిగత సహాయకుడు కూడా కన్నడిగుడేనని సత్యరాజ్ గుర్తు చేశారు.

 

సత్యరాజ్ వీడియో రిలీజ్ కు ఒకరోజు ముందే రాజమౌళి కూడా కన్నడిగులను బాహుబలి2 రిలీజ్ అడ్డుకోవద్దంటూ కోరుతూ వీడియో రిలీజ్ చేశారు. అడ్డుకుంటే అది సినిమాపై ప్రభావం చూపుతుందే తప్ప సత్యరాజ్ పై ఎలాంటి ప్రభావం ఉండదని రాజమౌళి అన్నారు.

 

సత్యరాజ్ బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్న ఎంత ఫేమసో కూడా తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి