‘బాహుబలి’ ఫేమ్ రాకేశ్ నటించిన 'పేక మేడలు' నుంచి ఇంట్రెస్టింగ్ గా ఫస్ట్ లుక్

By Asianet News  |  First Published Jul 20, 2023, 9:42 PM IST

‘బాహుబలి’ సేతుపతిగా ఫేమ్ దక్కించుకున్న నటుడు రాకేశ్ వర్రే హీరోగా నటించిన చిత్రం ‘పేక మేడలు’. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. 
 


తెలుగు చిత్రపరిశ్రమలో యంగ్ హీరోల సంఖ్య పెరుగుతోంది. తమ టాలెంట్ కు విభిన్న కథలను జోడించి ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ’బాహుబలి' చిత్రంలో సేతుపతిగా నటించి మెప్పించిన యువ నటుడు రాకేష్ వర్రే తన స్వీయ నిర్మాణంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకం పై కథానాయకుడిగా చేసిన చిత్రం 'ఎవ్వరికీ చెప్పొద్దు'. 2019 దసరాకి థియేటర్స్ లో  సందడి చెయ్యటమే కాకుండా గత నాలుగు సంవత్సరాల్లో నెట్ ఫ్లిక్స్ లో అత్యధికంగా చూడబడ్డ తెలుగు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

ఇప్పుడు అదే క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్ బ్యానర్ మీద రాకేష్ వర్రే కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ "పేకమేడలు" అనే నూతన చిత్రాన్ని నిర్మించి విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా 'నా పేరు శివ','అందగారం' వంటి హిట్ చిత్రాల్లో నటించిన వినోద్ కిషన్, నూతన నటి అయిన అనూష కృష్ణ లను తెలుగు తెర కి హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. వారితో పాటూ ఈ చిత్రానికి 50 మంది నూతన నటీ నటులతో పాటు ఎంతో ప్రతిభావంతులైన టెక్నిషన్స్ పని చేసారు. 'అంగమలి డైరీస్', 'జల్లికట్టు' వంటి చిత్రాలకు సౌండ్ డిజైన్ అందజేసిన ప్రముఖ సౌండ్ డిజైనర్  రంగనాధ్ రేవి సౌండ్ మిక్సర్ కన్నన్ గన్ పత్ ఈ చిత్రానికి పని చేసారు.

Latest Videos

ఈ చిత్రం ద్వార నీలగిరి మామిళ్ళ అనే నూతన దర్శకుడు తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయం అవుతున్నాడు. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్ లో నిర్మించిన 'పేకమేడలు' చిత్రం యొక్క పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ని చిత్రబృందం ప్రేక్షుకులకి రిలీజ్ చేసారు. ఈ చిత్రానికి ‘పేకమేడలు’ అనే వైవిధ్యమైన టైటిల్‌ను పెట్టారు. ఫస్ట్‌ లుక్, మోషన్ పోస్టర్, టైటిల్ లానే వైవిధ్యంగా వుంది.  హైదరాబాద్ బస్తి, సిటీని కలగలిపిన 360 డిగ్రీలో ఉన్న ఫోటోకి మధ్యలో ఆకాశానికి నిచ్చన వేసిన కథానాయకుడు వినోద్ కిషన్ లుంగీ కట్టుకుని, బనియన్ వేసుకుని సగం తొడుక్కున్న చొక్కాని, కళ్ళజోడు పెట్టుకుని చిరునవ్వుతో కనిపిస్తున్నారు, బ్యాగ్రౌండ్ లో ఉన్న బస్తి, సిటీ కలగలిపినట్టు కథానాయకుడు ఆహార్యంలో ఫార్మల్ బట్టలు సగం, బనియన్ లుంగీ సగం కట్టుకుని ఉన్నారు.. ఆ పోస్టర్ కి సరిపడా ‘పేకమేడలు’ టైటిల్ సర్రిగా సరిపోయింది.

యూనీక్ స్టోరీలైన్ తో పూర్తిస్థాయి ఎంటర్ టైనర్ గా రూపొందించిన ఈ చిత్రాన్ని ఇదే ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఇంకా రిలీజ్ డేట్ కన్ఫమ్ చేయాల్సి  ఉంది. డీవోపీగా హరిచరణ్.కె వ్యవహరించారు. స్మరన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటి నుంచి వరుసగా అప్డేట్స్  రానున్నాయి. 

click me!