అమెరికాలో రిలీజ్ కు ముందే బాహుబలి కలెక్షన్స్ రికార్డు

Published : Apr 27, 2017, 12:04 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
అమెరికాలో రిలీజ్ కు ముందే బాహుబలి కలెక్షన్స్ రికార్డు

సారాంశం

అమెరికాలో రిలీజ్ కు ముందే బాహుబలి కలెక్షన్స్ రికార్డు

తెలుగు సినిమా కీర్తిని ప్రపంచానికి చాటిన బాహుబలి 2 రిలీజ్ కు మరికొన్ని గంటల సమయం మాత్రం ఉంది. ఇప్పటికే రికార్డ్ ల వేట మొదలు పెట్టిన బాహుబలి.. యుఎస్ లో సంచలనాలు నమోదు చేస్తోంది. ఓవర్ సీస్ కలెక్షన్లలో మిలియన్ మార్క్ చేరుకునేందుకు చాలా మంది స్టార్ హీరోలు తెగ కష్టపడుతుంటే... బాహుబలి మాత్రం కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 3 మిలియన్లకు పైగా కలెక్ట్ చేసేసింది. బాహుబలి ప్రీ సేల్స్ లోనే మూడు మిలియన్లకు పైగా వసూళ్లు సాధించినట్టుగా యుఎస్ డిస్ట్రిబ్యూటర్స్ గ్రేట్ ఇండియా ఫిలిం ప్రకటించారు.

ఇప్పటికే భారీగా బుకింగ్స్ జరుగుతుండటంతో ప్రతీ గంటకు లక్ష డాలర్ల చొప్పున కలెక్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. బాహుబలి ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుండగా, ప్రీమియర్స్ షోను గురువారం రాత్రి నుంచే ప్రారంభిస్తున్నారు. కేవలం ఓవర్ సీస్ లోనే కాకుండా ఇండియాలోనూ గురువారం రాత్రి నుంచే బాహుబలి షోలు ప్రారంభిస్తున్నారు.

కలెక్షన్స్ పరంగా ఇప్పటికే రికార్డు సాధించిన బాహుబలి ఇంకెన్ని రికార్డులు, సంచలనాలు నమోదు చేయనుందో.

PREV
click me!

Recommended Stories

Rashmika Mandanna: కాబోయే అత్తతో రష్మిక మందన్నా.. రహస్యంగా ఇంత కథ నడిపించారా? ఫోటోలు వైరల్‌
Prabhas Favorite Director: ప్రభాస్‌కి ఇష్టమైన సినిమా ఇదే, యాక్షన్‌ లవర్స్ కి షాక్‌.. పూరీని మించినోడు లేడు