అవినాష్‌ ఈ స్థితికి నోయలే కారణమా?.. అరియానా అలా అనడానికి కారణమేంటి?

Published : Nov 09, 2020, 06:56 PM IST
అవినాష్‌ ఈ స్థితికి నోయలే కారణమా?.. అరియానా అలా అనడానికి కారణమేంటి?

సారాంశం

అవినాష్‌ అంతగా బాధపడటానికి కారణాలేంటి? అరియానా ఎందుకు అలా అన్నది అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. అవినాష్‌ `బిగ్‌బాస్‌4`లోకి వచ్చే ముందు `జబర్దస్త్` ని కోల్పోయాడు. అక్కడ ఆయన్ని అవమానించి పంపించారని ఓ సందర్భంలో చెప్పారు.  

కమెడీయన్‌, బిగ్‌బాస్‌ 4 కంటెస్టెంట్‌ అవినాష్‌ ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో కన్నీళ్ళు పెట్టుకోవడం అందరిని కలచి వేస్తుంది. నాగార్జున డబుల్‌ ఎలిమినేషన్‌ అని చెప్పి షాక్‌ ఇచ్చాడు. దీంతో అమ్మా రాజశేఖర్‌, అవినాష్‌ ఇద్దరు ఎలిమినేట్‌ అయ్యారని అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో అవినాష్‌ని స్టోర్‌ రూమ్‌లోకి పంపి ఎలిమినేషన్‌ నుంచి తప్పించాడు. 

అయితే స్టోర్‌ రూమ్‌లో, హౌజ్‌లోకి వచ్చాక అవినాష్‌ ఓ రేంజ్‌లో కన్నీళ్ళు పెట్టుకున్నాడు. తన బాధని గుర్తు చేసుకుంటూ బోరున విలపించాడు. సేవ్‌ అయిన తర్వాత ఎందుకు ఏడుస్తున్నావని నాగ్‌ ప్రశ్నించిగా, జీరోకి వెళ్లిపోయాను సర్‌ అని కన్నీంటి పర్యంతమయ్యాడు. ఇది ఇంటి సభ్యులను సైతం భావోద్వేగానికి గురిచేసింది. అందరు కలిసి ఆయన్ని ఓదార్చారు. 

అయితే అవినాష్‌ అంతగా బాధపడటానికి కారణాలేంటి? అరియానా ఎందుకు అలా అన్నది అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. అవినాష్‌ `బిగ్‌బాస్‌4`లోకి వచ్చే ముందు `జబర్దస్త్` ని కోల్పోయాడు. అక్కడ ఆయన్ని అవమానించి పంపించారని ఓ సందర్భంలో చెప్పారు.  ఇళ్ళు కట్టుకోవడం, బాగా అప్పులు కావడంతో చాలా కష్టాల్లో ఉన్నానని చెప్పాడు. `బిగ్‌బాస్‌` తనని సేవ్‌ చేస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఒకానొక సందర్భంలో అప్పులు, వ్యక్తిగత నష్టాల వల్ల ఆయన ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్టు చెప్పాడు. 

అయితే అవినాష్‌ ఇంకా దాన్ని మర్చిపోయినట్టు లేడు. అరియానా సైతం నిన్నటి ఎపిసోడ్‌లో `బూత్‌`లోకి వెళ్లిప్పుడు అవినాష్‌ని ఓదార్చింది. ఆత్మహత్యలాంటివి చేసుకోకని, నువ్వు బతికి ఉండాలని, నా కోసం నువ్వు ఉండాలని, నేను వచ్చేంత వరకు ఉండాలని, నీకు ఏం కాదని, కాళ్లు పట్టుకుంటానని చెప్పింది అరియానా. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్‌ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవడం ఓ కోణం అయితే, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఇంకా అవినాష్‌లో ఉండటం అందరిని కదిలిస్తుంది. 

ఎన్ని కష్టాలున్నా, ఆత్మహత్య చేసుకోవాలా? బయటకు వచ్చాక బతకడం కష్టమా? పేరు తెచ్చుకున్న ఆర్టిస్టుకి, ప్రతిభ ఉన్న ఆర్టిస్టుకి అవకాశాలు చాలా వస్తుంటాయి. అవినాష్‌ కామెడీకి, మిమిక్రీకి మంచి పేరుంది. కానీ అవినాష్‌ ఎందుకు అంత దారుణంగా ఆలోచిస్తున్నారని కామెంట్‌ చేస్తున్నారు అభిమానులు, సాధారణ ప్రజలు. 

మరి ఒకప్పుడు అసలు నామినేషన్‌లోకే రాని అవినాష్‌ ఇప్పుడు వరుసగా ఎలిమినేషన్‌కి నామినేట్‌ కావడం చర్చనీయాంశంగా మారింది. దీనికంతటికి కారణం నోయలేనా ? అనే సందేహాలు వస్తున్నాయి. నోయల్‌ వెళ్తూ వెళ్తూ, అమ్మా రాజశేఖర్‌, అవినాష్‌పై బ్యాడ్‌ ఇంప్రెషన్‌ పడేలా విమర్శించి వెళ్లారు. ఆ సమయంలో నోయల్‌పై అమ్మా, అవినాష్‌ ఫైర్‌ అయ్యారు. ఈ వివాదమే అవినాష్‌ని డౌన్‌ చేసిందనే కామెంట్లు వస్తున్నాయి. హౌజ్‌ నుంచి వెళ్లే వారు ఎవరైనా సాధ్యమైనంత వరకు పాజిటివ్‌గా చెప్పి, నెగటివ్స్ ఉంటే వాటిని కూల్‌గా చెబుతారు. కానీ నోయల్‌ అలా చెప్పలేదు. ఇదే ఇప్పుడు అవినాష్‌ పట్ల శాపంగా మారిందా? అనే చర్చ జరుగుతుంది. మరి ఈ ఎపిసోడ్‌తోనైనా అవినాష్‌ పుంజుకుంటాడా? అన్నది చూడాలి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి