తన ఫోటో ట్రోలింగ్‌పై ఘాటుగా స్పందించిన ట్వింకిల్ ఖన్నా

Published : Nov 09, 2020, 05:19 PM IST
తన ఫోటో ట్రోలింగ్‌పై ఘాటుగా స్పందించిన ట్వింకిల్ ఖన్నా

సారాంశం

అక్షయ్‌ భార్య, ట్వింకిల్‌ ఖన్నాని టార్గెట్‌ చేశారు. చిత్ర పోస్టర్‌లో ట్వింకిల్‌ ఖన్నా ఫోటో పెట్టి మార్ఫింగ్‌ చేసి, ఆమెకి బ్లూ కలర్‌ జోడించి నుదుట ఎర్రని బొట్టు పెట్టారు. అంతటితో ఆగడం లేదు `ట్వింకిల్‌బాంబ్‌` అనే టైటిల్‌ పెట్టి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసి ట్రోలింగ్‌ చేస్తున్నారు. 

అక్షయ్ కుమార్‌ నటించిన `లక్ష్మిబాంబ్‌` చిత్రం ఇటీవల వివాదాల్లో ఇరుక్కుంది. ఈ చిత్ర టైటిల్‌ లక్ష్మీ దేవిని అవమాన పరిచేలా ఉందనే కామెంట్లు రావడంతో టైటిల్‌ని `లక్ష్మి`గా మార్చారు. ఇక ఇప్పుడు అక్షయ్‌ భార్య, ట్వింకిల్‌ ఖన్నాని టార్గెట్‌ చేశారు. చిత్ర పోస్టర్‌లో ట్వింకిల్‌ ఖన్నా ఫోటో పెట్టి మార్ఫింగ్‌ చేసి, ఆమెకి బ్లూ కలర్‌ జోడించి నుదుట ఎర్రని బొట్టు పెట్టారు. అంతటితో ఆగడం లేదు `ట్వింకిల్‌బాంబ్‌` అనే టైటిల్‌ పెట్టి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసి ట్రోలింగ్‌ చేస్తున్నారు. 

తాజాగా దీనిపై ట్వింకిల్‌ ఖన్నా స్పందించి సీరియస్‌ అయ్యారు. ఈ పోస్టర్‌ తన దృష్టికి రావడంతో ట్వింకిల్‌ ఖన్నా స్పందిస్తూ, `ఒక మంచి ఫోటో కోసం వెతుకుతున్న సమయంలో ఈ ట్రోలింగ్‌ నాకు సహాయకారిగా పనిచేసింది. ఒకరు ఈ ఫోటోకు నన్ను ట్యాగ్‌ చేసి.. `థర్డ్ క్లాస్‌ పర్సన్‌. మీరు దేవుడి మీద జోకులేసి ఎగతాళి చేస్తారా?. అవును దేవుళ్ళకు జోకులంటే చాలా ఇష్టం. లేకపోతే నిన్నెందుకు భూమి మీదకు పంపిస్తారు? ఏదేమైనా కొత్త స్కిన్‌టోన్‌తో, పెద్ద బొట్టుతో ఈ దీపావళికి టపాసులా రెడీ అవుతాన`ని రిప్లై ఇచ్చారు. 

రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన `లక్ష్మి` చిత్రం తెలుగు, తమిళంలో వచ్చిన `కాంచన`కి రీమేక్‌. ఇది ఈ రోజు సాయంత్రం డిస్నీ హాట్‌ స్టార్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా రాఘవ లారెన్స్ అక్షయ్‌కి, సపోర్ట్ చేస్తున్న ట్రాన్స్ జెండర్లకి థ్యాంక్స్ చెప్పారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి