జబర్దస్త్ వాళ్ళు అవమానించి వెల్లగొట్టారుః `బిగ్‌బాస్‌4` ముక్కు అవినాష్‌ ఆవేదన

Published : Nov 04, 2020, 09:08 AM IST
జబర్దస్త్ వాళ్ళు అవమానించి వెల్లగొట్టారుః `బిగ్‌బాస్‌4` ముక్కు అవినాష్‌ ఆవేదన

సారాంశం

మంగళవారం  జరిగిన ఎపిసోడ్‌లో నామినేషన్‌కి ఎంపికైన వారిలో అవినాష్‌ ఉన్నాడు. నామినేషన్‌ నుంచి తప్పించుకోవడానికి ఓ ఆఫర్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇందులో నామినేషన్‌ లో ఉన్నవారిని రకరకాల ఇబ్బందులకు గురి చేస్తుంటారు. 

`జబర్దస్త్` వాళ్ళు తనని చాలా అవమానించి ఆ రియాలిటీ షో నుంచి వెళ్లగొట్టారని `బిగ్‌బాస్‌4` కంటెస్టెంట్‌ ముక్కు అవినాష్‌ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ షో నిర్వహకులు తనని `బిగ్‌బాస్‌`లోకి వచ్చేందుకు అనుమతించలేదట. తనకి `బిగ్‌బాస్‌` ఆఫర్‌ వచ్చిందని చెప్పినప్పుడు అనుమతించేందుకు నానా రకాలుగా ఇబ్బంది పెట్టినట్టు తన ఆవేదన వ్యక్తం చేశారు. 

మంగళవారం  జరిగిన ఎపిసోడ్‌లో నామినేషన్‌కి ఎంపికైన వారిలో అవినాష్‌ ఉన్నాడు. నామినేషన్‌ నుంచి తప్పించుకోవడానికి ఓ ఆఫర్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇందులో నామినేషన్‌ లో ఉన్నవారిని రకరకాల ఇబ్బందులకు గురి చేస్తుంటారు. వాటిని ఫేస్‌ చేసి చివరి వరకు ఉండాలి. అలా ఉన్న వారు నామినేషన్‌ నుంచి సేవ్‌ అవుతారు. ఈ టాస్క్ లో అభిజిత్‌ తప్పుకోగా, హారిక రెండు సార్లు తలలేపిన కారణంగా ఆమె విరమించాల్సి వచ్చింది. అయితే ఒకరి కంటే ఎక్కువ మంది ఉండగా, ఇది వర్తించదని బిగ్‌బాస్‌ చెప్పారు. 

దీంతో నామినేట్‌ అయిన సభ్యులు పడ్డ కష్టం అంతా వృథా అయ్యింది. ఈ సందర్భంగా అవినాష్‌ తన ఆవేదన వ్యక్తం చేశారు. తాను చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టు పేర్కొన్నారు. అదే సమయంలో `జబర్దస్త్` గురించి షాకింగ్‌ విషయాలు వెల్లడించారు. సోహైల్‌తో ఆయన మాట్లాడుతూ, `నేను చేసే రియాలిటీ షో నిర్వాహకులు బిగ్‌బాస్‌లోకి రావడానికి ఒప్పుకోలేదు. వారితో అగ్రిమెంట్ ఉన్న కారణంగా బిగ్‌బాస్‌కు రావడానికి కష్టంగా మారింది. ఒక్కసారి వెళ్లిపోతే మళ్లీ తీసుకోమని చెప్పారు. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవడానికి చాలా కష్టాలు పడ్డాను. అవమానాలు భరించాను. ఇక్కడి నుంచి బయటకు వెళ్తే నాకు వేరే ఆప్షన్ లేదు` అని అవినాష్ అన్నారు. గతంలో తాను ఆర్థిక కష్టాల్లో ఉన్నట్టు, సూసైడ్‌కు ప్రయత్నించినట్టు తెలిపిన విషయం తెలిసిందే.

ఇంటి బయట అలాంటి పరిస్థితులు ఉన్నవి కాబట్టి, బిగ్‌బాస్‌లో రాణించడానికి చాలా కష్టపడుతున్నాని తెలిపారు. ఇందులో ఉండేందుకు ఎన్ని కష్టాలైన ఫేస్‌ చేస్తానని పేర్కొన్నారు. అవినాష్‌ చెప్పిన విషయాలు సోహైల్‌ని, అరియానాని ఎమోషనల్‌కి గురి చేశాయి. అంతేకాదు అవినాష్‌పై ప్రేక్షకుల్లోనూ సింపతి పెరిగింది. ఇదిలా ఉంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ రెండు వారాల నుంచి అవినాష్‌ నామినేషన్‌కి ఎంపికవుతున్నారు. దీంతో అవినాష్‌లో తెలియని ఆందోళన ఏర్పడింది. పైగా గత ఆదివారం నోయల్‌.. అవినాష్‌ని బ్యాడ్‌ చేసి వెళ్ళిపోయాడు. ఇవన్నీ అవినాష్‌ని ఇరకాటంలో పెట్టాయి. మరి దీన్ని ఈ `జోకర్‌` ఎలా ఓవర్‌కమ్‌ చేస్తాడో చూడాలి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి