హారర్ మూవీతో రీ ఎంట్రీ?

Published : Jul 08, 2019, 09:38 AM IST
హారర్ మూవీతో రీ ఎంట్రీ?

సారాంశం

చిన్నారి పెళ్లి కూతురు (బాలికా వదు)  ఫెమ్ అవికా గోర్ గత కొంత కాలంగా టాలీవుడ్ సినిమాలకు దూరంగానే ఉంటుంది. ఆ మధ్య క్యాస్టింగ్ కౌచ్ పై గట్టిగానే కౌంటర్లు వేసిన అమ్మడు అవకాశాలు తగ్గడానికి ఒక వ్యక్తి కారణమని చెప్పి వెళ్లిపోయింది. 

చిన్నారి పెళ్లి కూతురు (బాలికా వదు)  ఫెమ్ అవికా గోర్ గత కొంత కాలంగా టాలీవుడ్ సినిమాలకు దూరంగానే ఉంటుంది. ఆ మధ్య క్యాస్టింగ్ కౌచ్ పై గట్టిగానే కౌంటర్లు వేసిన అమ్మడు అవకాశాలు తగ్గడానికి ఒక వ్యక్తి కారణమని చెప్పి వెళ్లిపోయింది. అప్పట్లో ఉయ్యాలా  జంపాల - సినిమా చూపిస్త మామ సినిమాలతో అవికా మంచి క్రేజ్ అందుకుంది. 

అలాగే ఎక్కడికి పోతావు చిన్నవాడలో డిఫరెంట్ రోల్ లో కనిపించి మెప్పించింది. అనంతరం తెలుగులో పలు ఆఫర్లు వచ్చినా బేబీ ఎందుకో ఒప్పుకోలేదట. అయితే ఇన్నాళ్ళకి రాజుగారి గది 3 లో కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఆమెకు హీరోయిన్ క్యారెక్టర్ అఫర్ చేశారా? లేక ఏదైనా స్పెషల్ సపోర్టింగ్ ఇచ్చారా అనేది తెలియాల్సి ఉంది. 

ఎందుకంటే దర్శకుడు ఓంకార్ మెయిన్ లీడ్ కోసం తమన్నా - కాజల్ వంటి ముద్దగుమ్మలను ట్రై చేస్తున్నాడు. అయితే తమన్నా - తాప్సి ప్రాజెక్ట్ పై అంతగా ఇంట్రెస్ట్ చూపడం లేదట. కాజల్ ఒప్పుకునే అవకాశం ఉన్నట్లు టాక్. ఇక అవికా గోర్ అయితే త్వరలో మరికొన్ని తెలుగు సినిమాలతో ఆడియెన్స్ ని మెప్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం.   

PREV
click me!

Recommended Stories

ఫంకీ ట్రైలర్ రివ్యూ, త్రివిక్రమ్ ని అడిగితే ఏమన్నాడో తెలుసా.. నవ్వుల మోత, విశ్వక్ సేన్ కి భారీ హిట్ లోడింగ్ ?
మహేష్ బాబు నేచురల్ పెర్ఫార్మెన్స్ కి కృష్ణంరాజు ఫిదా, అది డైరెక్టర్ చేసిన మ్యాజిక్ అంటూ ప్రశంసలు