Avika Gor: ప్రియుడితో అవికా గోర్ నిశ్చితార్థం.. చిన్నారి పెళ్ళికూతురికి కాబోయే భర్త ఎవరో తెలుసా ?

Published : Jun 11, 2025, 09:54 PM IST
Avika Gor

సారాంశం

చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్ తన ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించింది. ఆమెకి కాబోయే భర్త గురించి ఆసక్తికర విషయాలు వైరల్ గా మారాయి. 

అవికా గోర్ నిశ్చితార్థం 

నటి అవికా గోర్ బుల్లితెర ద్వారా గుర్తింపు సొంతం చేసుకుంది. చిన్నారి పెళ్లికూతురు టీవీ సీరియల్ అవికా గోర్ కి పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత అవికా గోర్ కి హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి. తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. ఇటీవల అవికా గోర్ కి ఆఫర్స్ తగ్గాయి. కాగా అవికా గోర్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలకబోతోంది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న అవికా తన ప్రియుడు మిలింద్ చంద్వానితో నిశ్చితార్థం చేసుకుంది. జూన్ 11, 2025న ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన నిశ్చితార్థాన్ని ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచింది.

ఎమోషనల్ పోస్ట్ 

"అతడు ప్రపోజ్ చేశాడు.. నేను నవ్వాను, ఏడ్చాను (ఆ క్రమంలో)... అతడి ప్రేమకి అవును అని సమాధానం చెప్పడం నాకు చాలా సులభంగా అనిపించింది!" అంటూ తన భావోద్వేగపూరిత పోస్టులో పేర్కొంది. ఆ పోస్టుతో పాటు కొన్ని నిశ్చితార్థ ఫోటోలను కూడా షేర్ చేసింది. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది. అభిమానులు, స్నేహితులు అవికా గోర్ కి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా అవికా గోర్ కి కాబోయే భర్త మిలింద్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. 

 

 

అవికా గోర్ కి కాబోయే భర్త గురించి ఆసక్తికర వివరాలు 

అవికా గోర్, మిలింద్ చంద్వాని హైదరాబాద్‌లో కొంతకాలం క్రితం కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలుసుకున్నారు. ఆ పరిచయం నెమ్మదిగా బలమైన బంధంగా మారింది. ఒక ఇంటర్వ్యూలో అవికా మాట్లాడుతూ మొదట మేం స్నేహితులుగా ఉన్నాం.. ఆ తర్వాత స్నేహం ప్రేమగా మారింది అని పేర్కొంది. మిలింద్ గతంలో ఎంటీవీ రోడీస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. ఆ తర్వాత సోషల్ యాక్టివిస్ట్ గా మారాడు. 

మిలింద్ ఐఎంఎం అహ్మదాబాద్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత క్యాంపస్ డైరీస్ అనే ఎన్జీవో సంస్థని స్థాపించాడు. ఆర్థికంగా వెనుకబడిన చిన్న పిల్లలకు సహాయం చేయడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. ఇక మిలింద్ గతంలో ఇన్ఫోసిస్ లో కూడా ఉద్యోగం చేశారు. 

అవికా గోర్ హీరోయిన్ గా బిజీగా ఉన్న టైంలోనే అతడితో ప్రేమలో పడింది.  ఇరువురి కుటుంబాలు అంగీకరించిన తర్వాతే, అవికా – మిలింద్ తమ ప్రేమను పబ్లిక్‌గా ప్రకటించారు. నిశ్చితార్థం వేడుక సింపుల్ గా, కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే ప్రైవేట్ గా జరిగింది. 

మొత్తంగా చిన్నారి పెళ్లి కూతురు నిజంగానే పెళ్లికూతురిగా మారబోతోంది. త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. ఉయ్యాలా జంపాల, సినిమా చూపిస్తమావ, రాజు గారి గది 3 లాంటి చిత్రాల్లో నటించింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nagarjuna తో పోటీకి దిగి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లరి నరేష్, ఇంతకీ ఆమూవీ ఏదో తెలుసా?
Savitri: మహానటి జీవితం నాశనం కావడానికి జెమినీ గణేషన్‌, పొలిటీషియన్‌ మాత్రమే కాదు, ఆ మూడో వ్యక్తి ఇతడేనా?