ప్రపంచ సినిమాని షేక్ చేసిన చిత్రం `అవతార్`. 2009లో వచ్చిన ఈ సినిమా మూడు ఆస్కార్ అవార్డులను అందుకుంది. అందులో బెస్ట్ ఆర్ట్ డైరెక్షన్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ లో ఆస్కార్ గెలుచుకుంది. ఇప్పుడు దీనికి రెండో భాగం `అవతార్ ః ది వే ఆప్ వాటర్` గతేడాది విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఇది ఆస్కార్ బరిలో నిలిచింది. ఆస్కార్‌ని గెలుచుకుంది. విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్‌ని దక్కించుకుంది.
జేమ్స్ కామెరూన్ అద్బుత సృష్టికి నిదర్శనమైన `అవతార్‌ఃది వే ఆఫ్ వాటర్` నాలుగు విభాగాల్లో `బెస్ పిక్చర్`, `బెస్ట్ సౌండ్`, `బెస్ట్, ప్రొడక్షన్ డిజైన్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ లో నామినేట్ అయ్యింది. ఇందులో ఆర్ట్ వర్క్ మిస్ కాగా, విజువల్ ఎఫెక్ట్స్ కి ఆస్కార్ దక్కించుకుంది. జోయి లెట్టెరీ, రిచర్డ్ బానెహమ్, ఎరిక్‌సైండన్, డానియల్ బర్రెట్ అవార్డులను అందుకున్నారు. బెస్ట్ సౌండ్, పిక్చర్ విభాగాలు మిగిలి ఉన్నాయి.
విజువల్ వండర్‌గా రూపొందిన `అవతార్` గతేడాది డిసెంబర్‌లో విడుదలై సంచలనం సృష్టించింది. అయితే మొదటి భాగంతో పోల్చితే, ఆ రేంజ్‌లో లేదనే విమర్శలెదుర్కొంది. ఎమోషన్స్ పండలేదు, బలమైన కథ లేదనే కామెంట్లు వచ్చాయి. దీంతో కలెక్షన్ల పరంగా ఇది సత్తా చాటలేకపోయింది. ఇందులో సామ్ వార్తింగ్టన్, జోయి సాల్డానా, సిగౌర్నీ వేవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్ లేట్ ప్రధాన పాత్రలో నటించారు.