`అవతార్‌ 2` విడుదలకు ముందే రికార్డులు.. రిలీజ్‌ అయితే సంచలనాలే!

Published : Nov 26, 2022, 07:38 PM IST
`అవతార్‌ 2`  విడుదలకు ముందే రికార్డులు.. రిలీజ్‌ అయితే సంచలనాలే!

సారాంశం

`అవతార్‌ 2`ని ఇండియాలోనూ భారీగా రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ గూస్‌బంమ్స్ తెప్పించింది. విజువల్‌ వండర్‌గా ఉండబోతుందని, దర్శకుడు జేమ్స్ కామెరూన్‌ ఆవిష్కరించిన దృశ్య కావ్యంగా ఉండబోతుందని తెలుస్తుంది.

`అవతార్‌`.. ప్రపంచ సినిమాలో అదొక సంచలనం. ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఆస్కార్ అవార్డుల పరంగానూ రికార్డులు క్రియేట్ చేస్తుంది.  ఈ సినిమా వచ్చి 13(2009)ఏళ్లు అవుతుంది. ఇన్నాళ్లకి దీనికి సీక్వెల్‌ వస్తుంది.`అవతార్‌` ది వే ఆఫ్‌ వాటర్‌` పేరుతో సీక్వెల్‌ తెరకెక్కగా, ఇది డిసెంబర్‌ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇండియాలోనూ భారీగా రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ గూస్‌బంమ్స్ తెప్పించింది. విజువల్‌ వండర్‌గా ఉండబోతుందని, దర్శకుడు జేమ్స్ కామెరూన్‌ ఆవిష్కరించిన దృశ్య కావ్యంగా ఉండబోతుందని తెలుస్తుంది. వాటర్‌ లో వార్‌ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని ట్రైలర్స్ ని బట్టి చూస్తే అర్థమవుతుంది. 

లేటెస్ట్ గా ఈ సినిమా విడుదలకు ముందే సంచలనాలు క్రియేట్‌ చేస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డు టికెట్లు అమ్ముడయ్యాయి. `అవతార్‌ః ది వే ఆఫ్‌ వాటర్‌` ఇండియాలో ఇంగ్లీష్‌తోపాటు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కాబోతుంది. ప్రీమియం ఫార్మాట్‌లలో 45 స్క్రీన్‌లలో అడ్వాన్స్ ఓపెనింగ్స్ జరిగిన 3 రోజుల్లోనే 15,000 టిక్కెట్‌ల సోల్డ్ అవుట్ అవ్వడం ద్వారా గొప్పగా ప్రారంభించబడింది, విడుదలకు ఇంకా 3 వారాలు మిగిలి ఉన్నాయి! భారతదేశం అంతటా ఈరోజు మరిన్ని షోలు తెరవబడతాయని నిర్వహకులు తెలిపారు.

`ఈ చిత్రం వచ్చే నెలలో భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో, అడ్వాన్స్ బుకింగ్‌లో ప్రారంభ ట్రెండ్ ఎవరైనా ఎప్పుడైనా చూడగలిగే పెద్ద బ్లాక్‌బస్టర్‌కు ప్రోత్సాహకరమైన సంకేతాన్ని ప్రదర్శిస్తుంద`ని పీవీఆర్‌ పిక్చర్స్ సీఈవో కమల్‌ జియం చందానీ తెలిపారు. ఆయన మాట్లాడుతూ, `జేమ్స్ కామెరూన్ , అతని సినిమాలు భారతీయ బాక్సాఫీస్‌పై ఎల్లప్పుడూ మాయాజాలం సృష్టించాయి. ఇప్పుడు ఇండియన్‌ ఆడియెన్స్ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు! అడ్వాన్స్ బుకింగ్స్ కి భారీ స్పందన వచ్చింది. ఇది కేవలం ప్రీమియం ఫార్మాట్‌లు. ఇతర అన్ని ఫార్మాట్‌లు ఈరోజు తెరుచుకోవడంతో, మేము భారీ సంఖ్యలను ఆశిస్తున్నాము` అని చెప్పారు. 

INOX లీజర్ లిమిటెడ్ చీఫ్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ రాజేందర్ సింగ్ జ్యాలా మాట్లాడుతూ, `అవతార్‌`కి సీక్వెల్ తరతరాలుగా ప్రజలు చూసే ఒక భారీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అవుతుంది. మేము సాధారణ 3D, 2D ఫార్మాట్‌ల బుకింగ్‌లను ప్రారంభించిన తర్వాత బుకింగ్ సంఖ్యలు గణనీయంగా పెరుగుతాయన్నారు. సినీపోలిస్ సీఈఓ దేవాంగ్ సంపత్ మాట్లాడుతూ.. `13 ఏళ్ల క్రితం విడుదలైన అవతార్ చిత్రానికి వచ్చిన భారీ స్పందన చూసి మైమరచిపోయాం. అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచినప్పటికీ ఇప్పటికీ సినీ ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంటోంది` అని వెల్లడించారు.

`అవతార్‌` సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.9 బిలియన్‌ డాలర్ల కలెక్షన్లు వసూలు చేసింది. ఇండియన్‌ రూపీ లెక్కల ప్రకారం ఇది సుమారు 19వేల కోట్లు. ఈ రికార్డుని ఇటీవల వచ్చిన `అవేంజర్‌` బ్రేక్‌ చేసింది. జస్ట్ క్రాస్‌ చేసింది. దీంతో ఇప్పుడు `అవతార్‌ 2` ఎన్ని రికార్డులు క్రియేట్‌ చేస్తుంది, ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా ఇండియాలోనే వెయ్యి కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యం లేదని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?
Gurram Paapi Reddy Review: గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ, రేటింగ్‌.. బ్రహ్మానందం, యోగిబాబు సినిమా ఎలా ఉందంటే?