'లక్ష్మీస్ ఎన్టీఆర్'.. చంద్రబాబుకి మరో షాక్!

Published : Mar 07, 2019, 10:48 AM ISTUpdated : Mar 07, 2019, 12:01 PM IST
'లక్ష్మీస్ ఎన్టీఆర్'.. చంద్రబాబుకి మరో షాక్!

సారాంశం

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల సినిమా ట్రైలర్ విడుదలై జనాల దృష్టిని ఆకర్షించింది.

ఇప్పటికే ఈ సినిమాను 'వెన్నుపోటు', 'ఎందుకు' పాటలు విడుదల చేసిన వర్మ తాజాగా మరో పాటను విడుదల చేశాడు. ''అవసరం.. అవసరం.. అవసరం.. ఆస్తులన్నీ పంచేవరకే తండ్రి అవసరం.. వరకట్నం ఇచ్చేవరకే మామ అవసరం..'' అంటూ సాగే ఈ పాటలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు చంద్రబాబునాయుడిని కూడా విమర్శించారు

రామ్ గోపాల్ వర్మ. ఆస్తులిచ్చే వరకు అవసరం కోసం ఎన్టీఆర్ కుటుంబసభ్యులు అతడితో ఉన్నారని, ఎన్టీఆర్ ని కష్టకాలంలో ఎవరూ పట్టించుకోలేదని ఈ పాట ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.

సిరాశ్రీ రాసిన ఈ పాటనువిల్సన్ హెరాల్డ్ పాడారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 22న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 
  

PREV
click me!

Recommended Stories

OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్
Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌