‘101 జిల్లాల అందగాడు’ రీమేక్ కాదు: డైరక్టర్ క్రిష్

By Surya PrakashFirst Published Aug 29, 2021, 12:13 PM IST
Highlights

‘బాల’కు కి రీమేక్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా కూడా బట్టతలతో ఇబ్బందులు పడుతుంటాడు. సినిమా కథంతా కూడా బట్టతల చుట్టూనే తిరుగుతుంది. ఈ నేపధ్యంలో నిర్మాత క్రిష్ క్లారిటీ ఇచ్చారు.

అవసరాల శ్రీనివాస్‌ టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. రాచకొండ విద్యాసాగర్‌ దర్శకుడు. రుహానీ శర్మ హీరోయిన్ గా నటించారు. ‘దిల్‌’ రాజు, డైరెక్టర్‌ క్రిష్‌ సమర్పణలో శిరీష్, రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు. ట్రైలర్ మొత్తం ఫన్నీగా, నవ్వులు పంచేలా ఉంది. సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ని ఈ ట్రైలర్ పెంచేస్తోంది. ఈ ట్రైలర్ చూసిన వారంతా ఈ సినిమా బాలీవుడ్ మూవీ ‘బాల’కు కి రీమేక్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఆ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా కూడా బట్టతలతో ఇబ్బందులు పడుతుంటాడు. సినిమా కథంతా కూడా బట్టతల చుట్టూనే తిరుగుతుంది. ఈ నేపధ్యంలో నిర్మాత క్రిష్ క్లారిటీ ఇచ్చారు. ‘నూటొక్క జిల్లాల అందగాడు’ రీమేక్ కాదన్నట్లుగా దీని నిర్మాత క్రిష్ పేర్కొన్నాడు.  క్రిష్ మాట్లాడుతూ.. ‘బాల’ సినిమా విడుదల కావడానికి కొన్నేళ్ల ముందే ‘నూటొక్క జిల్లాల అందగాడు’ కథ తయారైందని వెల్లడించాడు. తన దర్శకత్వంలో వచ్చిన ‘కంచె’ సినిమా సందర్భంగా ఈ చిత్రానికి పునాది పడిందన్నాడు. ఆ సినిమా కోసం జార్జియాలో షూటింగ్ జరుగుతున్నపుడు అవసరాల శ్రీనివాస్ తనకు, నిర్మాత రాజీవ్ రెడ్డికి ఈ కథ చెప్పాడని.. 20 నిమిషాల పాటు చెప్పిన ఈ కథ చాలా హిలేరియస్‌గా అనిపించిందని క్రిష్ తెలిపాడు.

ఐతే రెండేళ్ల తర్వాత దర్శకుడు విద్యాసాగర్ తనకో థ్రిల్లర్ కథ చెప్పాడని.. దాన్ని అవసరాలతో చేద్దామని అడిగితే అప్పుడు మాటల సందర్భంలో అంతకుముందు చెప్పిన కథ గురించి చర్చ వచ్చిందని.. ఆ కథకు ‘నూటొక్క జిల్లాల అందగాడు’ అనే టైటిల్ కూడా పెట్టానని చెప్పాడని.. కథను మరింత వివరంగా చెప్పాడని.. అది బాగా నచ్చే ఆ కథతోనే సినిమా చేద్దామని నిర్ణయించుకున్నామని.. అలా ‘కంచె’తో మొదలైన ఈ కథ.. సెప్టెంబరు 3న కంచెకు చేరబోతోందని క్రిష్ పేర్కొన్నాడు.

ఈ ట్రైలర్ లో అవసరాల శ్రీనివాస్ తన బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్, ఎమోషన్స్‌తో అదరకొట్టాడు. తన పెళ్ళికి బట్టతల అడ్డంకిగా మారడం,లవ్ సీన్స్ సినమాపై ఇంట్రస్ట్ ని కలగచేస్తున్నాయి. నాలుగు అక్షరాలు.. ఇది ఉంటే వివాహానికి ఇబ్బంది ఏంటది అని తల్లి పజిల్‌ వేయగా.. బట్టతల అని శ్రీనివాస్‌ జవాబుఇవ్వడం హిలేరియస్‌గా ఉంది. 

‘ఏ జుట్టు దువ్వుకుంటే దువ్వెనలకు పళ్లు సైతం రాలతాయని భయమేస్తుందో.. ఏ జుట్టు ముడిస్తే, కొండలు సైతం కదలుతాయో.. అటువంటి బలమైన, దట్టమైన, అందమైన జుట్టు ఇచ్చి, నన్ను ఈ కేశ దారిద్ర్యం నుంచి బయటపడేసి..ఈ క్షవర సాగరం దాటించు స్వామి’, అని హీరో వేడుకోవడం బాగుంది.

‘‘ప్రేమలో నిజాయతీ ఉండాలనుకునే అమ్మాయి... దొరక్క దొరికిన ప్రేమను, ప్రేయసిని వదులుకోకూడదనుకునే యువకుడు తనకు బట్టతల అనే నిజాలను దాస్తాడు. ఆ నిజం బయటపడితే వారి ప్రేమలో ఎలాంటి పరీక్షలు ఎదురవుతాయి? వారి మధ్య ఊసులు కరువై ఊహలే ఊసులైన వేళ ఎలా ఉంటుంది? తన ప్రేమలో నిజాయతీ ఉందని, తాను ఊరకనే మోసం చేయలేదని ప్రేమికుడు.. తెలిసి నిజాన్ని దాచి పెట్టడం తప్పు అనే ప్రేయసి చుట్టూ కథ తిరుగుతుందని చెప్తున్నారు.

click me!