
పుష్ప 2 మూవీ తర్వాత అల్లు అర్జున్.. తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేయడం దాదాపు ఖాయమనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అట్లీ గతేడాది షారుఖ్ ఖాన్‌తో చేసిన 'జవాన్' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. దాంతో అల్లు అర్జున్..ఈ దర్శకుడుతో సినిమా చేసి ప్యాన్ ఇండియాలో దూసుకుపోవాలనుకుంటున్నారు. అయితే ఈ ప్రాజెక్టు విషయమై అట్లీ వైపు నుంచి కండీషన్స్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిర్మాత అల్లు అరవింద్ ..తో డిస్కషన్స్ జరుగుతున్నాయి. అయితే అట్లీ పెట్టిన కండీషన్ ఓకే చేస్తేనే ప్రాజెక్టు పట్టాలు ఎక్కనుంది. ఆ కండీషన్స్ ఏమిటి..
జవాన్ సినిమా నిమిత్తం అట్లీకు రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో షేర్ అందిందిట. దాంతో ఈ ప్రాజెక్టుకు కూడా అదే అడుగుతున్నారు. భారీ రెమ్యునరేషన్ తో పాటు ప్రాఫిట్ షేరింగ్ డిమాండ్ చేస్తున్నారట. అయితే రెమ్యునరేషన్ తగ్గించుకుంటే ప్రాఫిట్ షేర్ ఇవ్వటానికి తమకు సమస్య లేదని అరవింద్ చెప్పినట్లు సమాచారం. అది ఏ రేషియోలో అనేది చర్చలు జరుగుతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అలాగే ప్రాజెక్టు సైన్ చేసాక..కంటిన్యూగా తనకు డేట్స్ ఇవ్వాలని, ప్రమోషన్ నుంచి అన్నీ తను దగ్గరుండి చూసుకునేలా వీలు కల్పించాలని అట్లీ మరో కండీషన్ పెట్టారట. అయితే ఎంతకాలం తన డేట్స్ బ్లాక్ చేయాలనేది ముందుగా చెప్పాలని అల్లు అర్జున్ అడిగారట.
ఇవి ఓకే చేస్తే ఈ సినిమాను అల్లు అర్జున్ పుట్టినరోజైన ఏప్రిల్ 8న అఫీషియల్‌గా ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా లెవల్లో భారీ యాక్షన్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట. తొలిసారి అల్లు అర్జున్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అట్లీ. దాంతో ఖచ్చితంగా బిజినెస్ ఓ రేంజిలో జరుగుతుందని నమ్ముతున్నారు. తెలుగు, తమిళం, హిందీ నిర్మాతలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారట. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే పేరును పరిశీలిస్తున్నారు. తనతో చేసిన దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురములో హిట్స్ తర్వాత మరోసారి వీళ్లిద్దరు ఈ మూవీలో జోడిగా కనిపించబోతున్నట్టు సమాచారం.