
ఫ్యాన్స్ ను డిస్సపాయింట్ చేశాడు మాస్ హీరో విశ్వక్ సేన్. ఒక సారి సినిమా పోస్ట్ పోన్ చేసి నిరాశపరిస్తే.. ఈసారి ఫ్యాన్స్ కోసం ఈవెంట్ ప్లాన్ చేసి ఉసూరుమనిపించాడు.
మంచి మంచి కథలు సెలక్ట్ చేసుకుంటూ.. దూసుకెళ్తున్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. యూత్ లో మంచి క్రేజ్ సాధించాడు యంగ్ హీరో. ఈ క్రేజీ హీరో నుంచి మంచి మాస్ సినమా కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స. అయితే ఈసారి మాత్రం డిఫరెంట్ లుక్ తో అర్జున కళ్యాణం అంటూ బయలుదేరాడు విశ్వక్.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తోన్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ అశోక వనంలో అర్జున కల్యాణం. ఈసినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ రచ్చ రచ్చ చేస్తోంది. రుక్షర్ ధిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమానువిద్యాసాగర్ చింతా డైరెక్ట చేస్తున్నారు. మే 6న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతోంది మూవీ. నేపథ్యంలో ప్రమోషన్స్ హడావిడిలో బిజీగా ఉన్నాడు విశ్వక్ సేన్.
అందులో భాగంగా ఈరోజు(24 ఏప్రిల్) సాయంత్రం హైదరాబాద్‌లో ఏఎంబీ సినిమాస్‌లో ఫ్యాన్స్ తో సమావేశం ఏర్పాటు చేశాడు. అయితే మూవీ లవర్స్ కోసం రెడీ చేసిన ఈవెంట్ అనుకోకుండా రద్దైంది. ఈ విషయాన్ని విశ్వక్ సేన్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలిపాడు మాస్ కా దాస్. ఇన్ స్టా లో ఇలా అనౌన్స్ చేశాడు విశ్వక్. క్షమించండి..సాయంత్రం కార్యక్రమం అనుకోని కారణాలతో రద్దయింది, కొత్త డేట్ ను త్వరలోనే ప్రకటిస్తాం..అని మెసేజ్ పెట్టాడు విశ్వక్ సేన్.
శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి జే క్రిష్ మ్యూజిక్ డైరెక్టర్.సూర్యాపేటలో వడ్డీ వ్యాపారం చేసుకునే యువకుడికి గోదావరి జిల్లాల నుంచి సంబంధం కలుపుకోవడానికి వెళ్తారు. ఆ తర్వాత సంబంధం కుదిరినట్టే కుదిరి..రద్దవుతుంది. ఆ తర్వాత ఆ యువకుడి జీవితంలో ఎలాంటి మలుపులు తిరిగిందనే కథతో ఈసినిమా తెరకెక్కింది. ట్రైలర్ లో చాలా వరకూ సినిమాపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్.