ముద్దు పెట్టింది కాని పెళ్లి వద్దంటోంది, అశోక వనంలో అర్జున కళ్యాణం ట్రైలర్ ట్రీట్

Published : Apr 20, 2022, 08:19 PM ISTUpdated : Apr 20, 2022, 08:20 PM IST
ముద్దు పెట్టింది కాని పెళ్లి వద్దంటోంది, అశోక వనంలో అర్జున కళ్యాణం ట్రైలర్ ట్రీట్

సారాంశం

మాస్ కా దాస్ విశ్వక్ హీరోగా రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటించిన సినిమా అశోక వనంలో అర్జున కళ్యాణం. మే 6న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈమూవీ ట్రైలర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు మేకర్స్. 

మాస్ కా దాస్ విశ్వక్ హీరోగా రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటించిన సినిమా అశోక వనంలో అర్జున కళ్యాణం. మే 6న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈమూవీ ట్రైలర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు మేకర్స్. 

సూర్యాపేట కుర్రాడు అర్జున్ కుమార్ అల్లం పాత్రలో విశ్వక్ సేన్ నటించారీ సినిమాలో. మా సూర్యాపేట మొత్తం ఒక్కటే టాపిక్.. అర్జున్ కుమార్ అల్లం గాడికి పెళ్లి కాలేదు, పెళ్లి కాలేదు పెళ్లి కాలేదు  అని అమ్మాయితో చెబుతూ ట్రైలర్ లో  హీరోని పరిచయం చేశారు. ముడ్డి కింద 30 వచ్చినాక 'కుదిరింది... కుదిరింది... కుదిరింది పెళ్లి కుదిరిందంటూ.. పెళ్లి కొడుకు అవతారంలో విశ్వక్ సేన్ ప్రత్యక్షం అయ్యారు. ఇలా ఈ ట్రైలార్ ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా సాగింది. 

ఇక  అసలు కథకు వస్తే... తెలంగాణ అబ్బాయికి, గోదావరి అమ్మాయికి పెళ్లి కుదిరింది. ఇద్దరి కులాలు వేరు, యాసలు వేరు. అయినా పెళ్లికి అంతా సిద్ధమైంది. అబ్బాయికి అమ్మాయి ముద్దు కూడా పెట్టేసింది. కానీ, పెళ్లి  మాత్రం ఇష్టం లేదని చెబుతోంది. ఇంతకీ ఎందుకలా చెప్పింది. అనేది కథ. మరి సినిమాను దర్శకుడు ఏ మలుపు తిప్పబోతున్నాడో అనేది ఈ ట్రైలర్ ద్వారా ఇంట్రెస్టింగ్ గా చేప్పే ప్రయత్నం చేశారు మూవీ టీమ్. 

 

విద్యా సాగర్ చింతా డైరెక్ట్ చేసిన అశోక వనంలో అర్జున కళ్యాణం మూవీని  ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్‌ ప్రసాద్  సమర్పణలో... ఎస్‌విసిసి డిజిటల్ పతాకంపై ఆయన తనయుడు బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు రాజావారు రాణీగారు మూవీ డైరెక్టర్ రవికిరణ్ కోలా కథ అందించారు. జై క్రిష్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. 

ఇక ఈమూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఓ ఆడపిల్ల.., రంగు రంగు రాంసిలకా... పాటలు ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. ఈమూవీ నుంచి ఇప్పటి వరకూ వచ్చిన ప్రతీ అప్ డేట్ సినిమాపై అంచనాలు పెంచింది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కు ఈ మూవీ టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందని నమ్ముతున్నారు.                    

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?
700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?