ఆకతాయి హీరో ఆశిష్ 'ఇగో ' చిత్రం ప్రారంభం

Published : Jul 02, 2017, 05:27 PM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
ఆకతాయి హీరో ఆశిష్ 'ఇగో ' చిత్రం ప్రారంభం

సారాంశం

వికెఎస్ ఫిలిమ్స్ బ్యానర్లో కె.ఆర్.విజయ్ కరణ్,కౌషల్,అనిల్ కరణ్ నిర్మాణంలో మరో మూవీ "ఆకతాయి" ఫేమ్ ఆశిష్, సిమ్రాన్ జంటగా 'ఇగో' ( ఇందు గోపి) ఆర్ వి సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇగో షూటింగ్ ప్రారంభం  

మా తుల్జా భవాని ఆశీస్సులతో  వికెఎస్ ఫిలిమ్స్ బ్యానర్ లో కె ఆర్ విజయ్ కరణ్, కె ఆర్ కౌషల్, కె ఆర్ అనిల్ కరణ్ ల నిర్మాణం లో "ఆకతాయి" ఫేమ్ ఆశిష్, సిమ్రాన్ జంటగా ఆర్ వి సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఇగో' ( ఇందు గోపి). ఈ నూతన చిత్ర ప్రారంభోత్సవం ఆదివారం అన్నపూర్ణ స్టూడియో లో  ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ సాయి కార్తీక్ ఇవ్వగా, కెమెరా స్విచ్ ఆన్ శ్రీనివాస్ గౌడ్ చేశారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. 

ఈ సందర్భంగా దర్శకుడు సుబ్రమణ్యం మాట్లాడుతూ.. "ఇద్దరి యంగ్ స్టర్స్ మధ్య కలిగే ఇగో నే ఈ చిత్ర ప్రధానాంశం. ఈ చిత్రం  చాలా డిఫరెంట్ ఉంటుంది , ఈ బ్యానర్ లో ఇది నా రెండో చిత్రం అవ్వడం సంతోషంగా ఉంది అన్నారు. 

ఈ చిత్ర నిర్మాత మాట్లాడుతూ..  "87 కథలు విన్న తరువాత సుబ్బు చెప్పిన ఈ కథ నచ్చి చేస్తున్న చిత్రమిది, ఈ సోమవారం నుంచే రామోజిఫిల్మ్ సిటీ లో షూటింగ్ ప్రారంభమవుతుంది, 3 షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేసి సెప్టెంబర్ లో విడుదల చేయడానికి ప్రయతిస్తాం అంటూ తెలిపారు. 

రామసత్యనారాయణ మాట్లాడుతూ.. "ఇద్దరి ఇగో ఇష్టల  స్టోరీ నే ఈ చిత్రం. ఈ చిత్ర నిర్మాతలు బడ్జెట్ కు వెనకాడకుండా సినిమా పూర్తి చేసే రకం కనుక చిత్రం మంచి క్వాలిటీ గా ఉంటుందని నమ్ముతున్నా, ఈ చిత్రం లో నటించిన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు తెలియచేస్తున్నా" అన్నారు. 

అనంతరం హీరో ఆశిష్ రాజ్, హీరోయిన్ సిమ్రాన్ లు మాట్లాడుతూ ఈ చిత్ర అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు  మా కృతజ్ఞతలని తెలిపారు. 

 

ఆశిష్ రాజ్, సిమ్రాన్ జంటగా నటిస్తున్న ఈ నూతన చిత్రానికి కొరియోగ్రాఫర్: విజ్ఞేష్, లిరిక్స్: భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, బాలాజీ, మేకప్: వేణు, స్టంట్స్: నందు, ఆర్ట్ డైరెక్టర్: ఆర్ కె రెడ్డి,  సంగీతం: సాయి కార్తీక్, నిర్మాతలు: కె ఆర్ విజయ్ కుమార్, కె ఆర్ కౌషల్ కరణ్, కె ఆర్ అనిల్ కరణ్, కథ- స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం : ఆర్ వి. సుబ్రహ్మణ్యం(సుబ్బు).

PREV
click me!

Recommended Stories

భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?
Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ డిసెంబర్ 16 బాలుని సవతి తల్లిలా చూశాను... ప్రభావతిలో మొదలైన పశ్ఛాత్తాపం