తారకరత్న మృతి... బాలయ్య అనూహ్య నిర్ణయం!

Published : Feb 20, 2023, 10:24 AM ISTUpdated : Feb 20, 2023, 10:33 AM IST
తారకరత్న మృతి... బాలయ్య అనూహ్య నిర్ణయం!

సారాంశం

మృత్యువుతో పోరాడి ఓడిపోయారు తారకరత్న. ఆయన మరణం నందమూరి కుటుంబంలో తీరని విషాదం నింపింది. ముఖ్యంగా బాలకృష్ణ వేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఆయన అనూహ్య నిర్ణయం తీసుకున్నారట.   

తారకరత్నను కాపాడుకునేందుకు బాలకృష్ణ చివరి నిమిషం వరకు పోరాడారు. మెరుగైన వైద్యంతో పాటు పూజలు, యజ్ఞయాగాదులు చేయించారు. విదేశీ వైద్యులను పిలిపించారు. అయితే మానవ ప్రయత్నం విధి రాతను మార్చలేదని రుజువైంది. తారకరత్న శివరాత్రి రోజు శివైక్యం అయ్యారు. ఫిబ్రవరి 18న తారకరత్న కన్నుమూసినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం తారకరత్న భౌతికకాయాన్ని బెంగుళూరు నుండి హైదరాబాద్ కి తరలించారు. నేడు మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. 

తారకరత్న మరణంతో ఆయన ముగ్గురు పిల్లలు తండ్రి లేనివారయ్యారు. నిషిక పెద్దమ్మాయి. తనయ్ రాయ్, రేయా ట్విన్స్. వీరిలో ఒకరు అబ్బాయి, మరొకరు అమ్మాయి. తారకరత్న పిల్లల విషయంలో బాలకృష్ణ అనూహ్య నిర్ణయం తీసుకున్నారట. ఇకపై వారి బాధ్యత ఆయనదే నట. అనధికారికంగా  తారకరత్న పిల్లలను ఆయన దత్తత తీసుకున్నారట. నిషిక, తనయ్ రామ్, రేయాల చదువు సంధ్యలు, పోషణ బాధ్యత తీసుకున్నారట. ఈ మేరకు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. 

తారకరత్న జనవరి 27న అస్వస్థతకు గురయ్యారు. నారా లోకేష్  యువగళం పాదయాత్ర కుప్పం నియోజకవర్గం వేదిక ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ, తారకరత్న హాజరయ్యారు. పాదయాత్ర మొదలైన కాసేపటికి తారకరత్న కుప్పకూలిపోయారు. ఆయన్ని స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. తారకరత్న కార్డియాక్ అరెస్ట్ కి గురైనట్లు తెలుసుకున్న వైద్యులు మెరుగైన వైద్యం కోసం బెంగుళూరు నారాయణ హృదయాలయ  ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. 

23 రోజులు పాటు ఆయనకు ఐసీయూలో చికిత్స జరిగింది. కార్డియాక్ అరెస్ట్ కి గురయ్యాక మెదడుకు రక్త ప్రసరణ అందలేదు. ఈ కారణంగా మెదడులో పై భాగం దెబ్బతింది. న్యూరో స్పెషలిస్ట్స్ ఎంత ప్రయత్నం చేసినా ఆయన మెదడు సాధారణ స్థితికి రాలేదు. దీంతో ఆయన కోమాలోనే కన్నుమూశారు. 2002లో తారకరత్న ఒకటో నెంబర్ కుర్రాడు మూవీతో హీరో అయ్యారు. 20 ఏళ్ళ కెరీర్లో పాతిక సినిమాల వరకు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్