కంగనాకు డెడ్ లైన్... అలా చేయకుంటే సెప్టెంబర్ 20 తర్వాత అరెస్ట్!

By team teluguFirst Published Sep 14, 2021, 3:09 PM IST
Highlights

కంగనా రనౌత్ తలైవి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుండగా, ఆమెకు ఓ బ్యాడ్ న్యూస్ ఎదురైంది. ఈసారి కోర్టుకి హాజరుకాకుంటే అరెస్ట్ వారంట్ జారీ చేస్తామని, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. 

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తలైవి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుండగా, ఆమెకు ఓ బ్యాడ్ న్యూస్ ఎదురైంది. ఈసారి కోర్టుకి హాజరుకాకుంటే అరెస్ట్ వారంట్ జారీ చేస్తామని, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. రచయిత జావేద్ అక్తర్ నటి కంగనా రనౌత్ పై పరువు నష్టం దావా కేసు వేశారు. 

ఈ కేసు విచారణ కోర్ట్ లో నడుస్తుండగా, కంగనా కోర్ట్ కు హాజరుకాకపోవడాన్ని జావేద్ అక్తర్ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. తన క్లయింట్ దాదాపు అన్ని హియరింగ్స్ కి హాజరవుతుండగా, కంగనా ఇప్పటి వరకు 8సార్లు కోర్టుకు రాలేదని జడ్జికి వివరించారు. ఇక కంగనా తరపు న్యాయవాది, ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె కోర్టుకి హాజరుకాలేకపోయారని, పత్రాలు సమర్పించారు. 

తలైవి మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న కంగనా పలువురు వ్యక్తులను కలిశారని, అలాగే ఆమెకు కోవిడ్ సంబంధింత లక్షణాలతో కనిపిస్తుండగా, ఆరోగ్యంగా లేరని , అందుకే ఆమె కోర్టుకి హాజరు కాలేక పోయారని, మెడికల్ సర్టిఫికేట్ సమర్పించారు. అయితే పలుమార్లు కోర్ట్ హియరింగ్స్ కి హాజరు కాని కంగనా పట్ల జడ్జి అసహనం వ్యక్తం చేశారు. 

ఈ కేసు నెక్స్ట్ హియరింగ్ సెప్టెంబర్ 20కి వాయిదా వేశారు. కంగనాకు కోవిడ్ కానీ పక్షంలో ఆమె కోర్టుకి తప్పనిసరిగా హాజరు కావాలి అన్నారు. అదే విధంగా ఈసారి కోర్ట్ విచారణకు హాజరు కాని నేపథ్యంలో ఆమెపై అరెస్ట్ వారంట్ జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. 
 

click me!