హీరో విశాల్ ని అరెస్ట్ చేయమని కోర్టు ఆర్డర్!

Published : Aug 03, 2019, 10:25 AM IST
హీరో విశాల్ ని అరెస్ట్ చేయమని కోర్టు ఆర్డర్!

సారాంశం

తాజాగా నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీగా ఉన్న విశాల్ తన కార్యానిర్వాహక వర్గ జీతాలకు సంబంధించిన పన్నులు, టీడీఎస్ సరిగ్గా చెల్లించలేదని, అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.

తెలుగు కుటుంబానికి చెందిన విశాల్ ని లీగల్ గా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. తాజాగా నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీగా ఉన్న విశాల్ తన కార్యానిర్వాహక వర్గ జీతాలకు సంబంధించిన పన్నులు, టీడీఎస్ సరిగ్గా చెల్లించలేదని, అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.

ఈ క్రమంలో ఐటీ అధికారులు విచారణకు హాజరు కావాల్సిందిగా పలుమార్లు నోటీసులు పంపినా విశాల్ స్పందించకపోవడంతో అధికారులు చెన్నైలోని ఎగ్మూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.

ఈ పిటిషన్ పై తాజాగా విచారణ జరిపిన ఎగ్మూర్ కోర్టు ఈసారి విశాల్ విచారణకు హాజరు కాని పక్షంలో అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి అరెస్ట్ చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

ఈ కేసుపై పునర్విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది. సినిమాల విషయానికొస్తే.. ఇటీవల 'అయోగ్య' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిసక్సెస్ అందుకున్న విశాల్ ప్రస్తుతం సుందర్ సి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు.   

PREV
click me!

Recommended Stories

చిరంజీవితో కలిసి 15 చిత్రాల్లో నటించింది.. కానీ చుక్కలు చూపించింది.! ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే
Gunde Ninda Gudi Gantalu Today 12 డిసెంబర్ ఎపిసోడ్: నీకు ముందే పిల్లలు ఉన్నారా? రోహిణిపై మీనా అనుమానం, ప్రభావతి తిక్క కుదర్చడానికి సుశీలమ్మ ఎంట్రీ...