'కబీర్ సింగ్'పై 'అర్జున్ రెడ్డి' రియాక్షన్!

Published : Jun 15, 2019, 04:28 PM IST
'కబీర్ సింగ్'పై 'అర్జున్ రెడ్డి' రియాక్షన్!

సారాంశం

విజయ్ దేవరకొండ హీరోగా టాలీవుడ్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం 'అర్జున్ రెడ్డి'. ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ హీరోగా టాలీవుడ్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం 'అర్జున్ రెడ్డి'. ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేస్తున్నారు. హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో రూపొందించా ఈ చిత్రంలో షాహిద్ కపూర్, కియారా అద్వానీలు జంటగా నటించారు.

తెలుగు వెర్షన్ డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా హిందీ వెర్షన్ కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ దక్కింది. బాలీవుడ్ లో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. జూన్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలో విజయ్ దేవరకొండ పాల్గొన్న తాజా ఇంటర్వ్యూలో ఆయనకి 'కబీర్ సింగ్' సినిమాకి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనిపై స్పందించిన ఆయన.. హిందీ రీమేక్ కూడా తన స్నేహితుడు సందీప్ రూపొందిస్తున్నాడని, సినిమా ఎలా వచ్చిందో చూడాలని తనకు కూడా ఎంతో ఆత్రుతగా ఉందని అన్నారు.

'ఇష్క్ విష్క్' సినిమా నుండి షాహిద్ ఓ మంచి నటుడిగా తనకు తెలుసునని, ఇప్పుడు 'కబీర్ సింగ్' సినిమాలో కూడా ఆయన అధ్బుతంగా నటించి ఉంటారని, ఆ నమ్మకం తనకుందని.. సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు