బట్టతల వచ్చేసింది.. ఇక పెళ్లెందుకు..? హీరో కామెంట్స్!

Published : May 08, 2019, 03:41 PM IST
బట్టతల వచ్చేసింది.. ఇక పెళ్లెందుకు..? హీరో కామెంట్స్!

సారాంశం

బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ తనకు పెళ్లి కాకుండానే బట్టతల వచ్చేసిందని చమత్కరిస్తున్నారు. 

బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ తనకు పెళ్లి కాకుండానే బట్టతల వచ్చేసిందని చమత్కరిస్తున్నారు. సీనియర్ నటి మలైకా చోప్రాతో కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్న అర్జున్ త్వరలోనే ఆమెని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే అందులో నిజం లేదని అర్జున్ చెబుతున్నా.. వార్తలు మాత్రం ఆగడం లేదు. దీంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాడు. ఈ క్రమంలో తనకు బట్టతల వచ్చేసిందని ఇక పెళ్లెందుకని ప్రశ్నిస్తున్నాడు. అర్జున్ నటిచబోయే తదుపరి సినిమాలో అతడి గెటప్ బట్టతలతో ఉంటుంది.

అందుకే ఇలాంటి కామెంట్ చేశాడు. ఆ తరువాత సీరియస్ గా మాట్లాడుకుందామంటూ తనకు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని, తన వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని కోరారు. ప్రస్తుతం తను ప్రేమలో సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. వృత్తి పరంగా, వ్యక్తిగతం ప్రశాంతంగా ఉన్నానని, సరిగ్గా తింటున్నానని, బాగా పడుకుంటున్నానని.. ఇంతకుమించి జీవితంలో ఇంకేం కావాలని ప్రశ్నిస్తున్నాడు.

ప్రస్తుతం ఆయన 'పానిపట్', 'ఇండియాస్ మోస్ట్ వాంటెడ్' చిత్రాల్లో నటిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Balakishna: `అఖండ 2` డిజాస్టర్‌ దెబ్బ.. బాలయ్య కొత్త సినిమాకి బడ్జెట్‌ కష్టాలు.. ఆగిపోయిందా?
ప్రభాస్ జోకర్ గెటప్ వెనుకున్న వ్యక్తి ఎవరంటే.? మనసులోని మాట చెప్పిన డైరెక్టర్ మారుతీ