కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల సినిమాలు బలమైన కథతో ఉంటాయి. మరి ఆచార్య కోసం ఈ స్టార్ డైరెక్టర్ ఎలాంటి కథ సిద్ధం చేశారు, మెగాస్టార్ రోల్ ఏంటి అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
అఖండ, పుష్ప, శ్యామ్ సింగ రాయ్ చిత్రాలతో కొన్ని రోజుల క్రితం బుస్సుమన్న టాలీవుడ్ బాక్సాఫీస్.. కరోనా ఎఫెక్ట్ తో మళ్ళీ తుస్సుమంది. సంక్రాంతికి విడుదుల కావాల్సిన భారీ చిత్రాలన్నీ వాయిదా పడ్డాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రం ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే అంచనా వేయలేం.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల సినిమాలు బలమైన కథతో ఉంటాయి. మరి ఆచార్య కోసం ఈ స్టార్ డైరెక్టర్ ఎలాంటి కథ సిద్ధం చేశారు, మెగాస్టార్ రోల్ ఏంటి అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
undefined
అయితే టీజర్స్, ఫస్ట్ లుక్స్ లో చిరంజీవి కామ్రేడ్ తరహా గెటప్ లో కనిపిస్తున్నాయి. అయితే దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. తాజాగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఓ ఇంటర్వ్యూలో ఆచార్య చిత్రంలోతాను, చిరంజీవి పోషిస్తున్న పాత్రలని రివీల్ చేసారు. తామిద్దరం నక్సల్స్ గా కనిపించబోతున్నట్లు ప్రకటించాడు.
అయితే ఈ చిత్రంలో సిద్ద పాత్రకు ఫస్ట్ ఛాయిస్ తాను కాదని రాంచరణ్ తెలిపాడు. నాన్న గారితో నేను ఫుల్ ఫ్లెడ్జ్ గా చేస్తున్న చిత్రం ఇదే. సిద్ద రోల్ కోసం మా ఫ్యామిలీ నుంచి కాకుండా బయట వ్యక్తుల్ని తీసుకోవాలని భావించాం. కానీ కుదర్లేదు. నేను నాటించాలనేది నా డెసిషన్ కాదు.
కొరటాల శివ గారు ఒకరోజు ఫోన్ చేసి.. నువ్వు ప్రజెంట్ ఆర్ఆర్ఆర్ లో బిజీగా ఉన్నావు. రాజమౌళిని మరో సినిమా కోసం సమయం అడగడం కూడా భావ్యం కాదు. నాకు తెలుసు.. కానీ ఈ కథలో నిన్ను తప్ప ఇంకొకరిని ఊహించుకోవడం కుదరడం లేదు. కథ పరంగా నువ్వైతేనే బావుంటుంది అని కొరటాల అన్నారు. అలా నన్ను దర్శకుడే నటించమని అడిగారు అంటూ చరణ్ చెప్పుకొచ్చాడు.