టాలీవుడ్ లెజెండ్స్ ని కలిసిన అర్జున్, ఐశ్వర్య!

Published : Jul 04, 2022, 04:10 PM IST
టాలీవుడ్ లెజెండ్స్ ని కలిసిన అర్జున్, ఐశ్వర్య!

సారాంశం

యాక్షన్ కింగ్ అర్జున్, కూతురు ఐశ్వర్యతో పాటు టాలీవుడ్ లెజెండ్స్ అయిన కృష్ణ, కే విశ్వనాథ్ ని కలిశారు. వాళ్ళ అశీసులు అందుకున్నారు.   


కన్నడ పరిశ్రమకు చెందిన అర్జున్ (Arjun Sarja)కి తెలుగులో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. హీరోగా ఆయన తెలుగులో ఏంతో సక్సెస్ అయ్యారు. ఈ మధ్య ఆయన విలన్ గా కూడా మారారు. లై చిత్రంతో పాటు కొన్ని చిత్రాల్లో ఆయన విలన్ రోల్స్ చేశారు. తాజాగా ఆయన డైరెక్టర్ అవతారం ఎత్తారు. డైరెక్టర్ గా తన డెబ్యూ మూవీలో కూతురు ఐశ్వర్యను హీరోయిన్ గా పరిచయం మరో విశేషం. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తుండగా ఈ ప్రాజెక్ట్ ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. 

పవన్ కళ్యాణ్ తో పాటు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుంది. ఈ నేపథ్యంలో అర్జున్, ఐశ్వర్య టాలీవుడ్ లెజెండ్స్ ని వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ, కళాతపస్వి విశ్వనాథ్ ని వేరువేరుగా కలిసిశారు. సదరు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. 

ఇక రెండేళ్ల క్రితం అర్జున్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా హఠాన్మరణం పొందారు. హీరోగా మంచి భవిష్యత్ ఉన్న చిరంజీవి మరణం ఆ కుటుంబంలో విషాదం నింపింది. అర్జున్ కి చిరంజీవి సార్జా అంటే ప్రాణం. అతని మరణం అర్జున్ ని కృంగదీసింది. అర్జున్ మరో మేనల్లుడు ధృవ్ సర్జా కన్నడలో హీరోగా రాణిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా