వైవిధ్యంగా దూసుకెళ్తున్న సత్యదేవ్.. మరో చిత్రం నుంచి అదిరిపోయే పోస్టర్..

By team teluguFirst Published Jul 4, 2022, 2:35 PM IST
Highlights

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ (Satya Dev) విభిన్నమైన సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ రోజు పుట్టిన రోజు సందర్భంగా మరో కొత్త చిత్రం అదిరిపోయే పోస్టర్ ను వదిలారు.
 

షార్ట్ ఫిల్మ్స్ తో తన కేరీర్ ను స్టార్ చేసి, టాలెంటెడ్ హీరోగా ఎదిగిన నటుడు సత్యదేవ్. మొదటి నుంచి ఆయన ఎంచుకుంటున్న  సినిమాలు, పోషిస్తున్న పాత్రలు ఇతర సినిమాలకంటే చాలా భిన్నంగా ఉంటాయి. కొత్త కథాంశాలతో ఎప్పుడూ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసేందుకు ముందుంటాడు సత్యదేవ్. ఇటీవల ‘గాడ్సే’ (Godse) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్య.. పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకున్నాడు. ఇక ఆయన నటనకు ఆడియెన్స్ ను ఫిదా అయ్యారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

ఇప్పటికే మూడు నాలుగు చిత్రాల్లో నటిస్తున్న సత్యదేవ్ తాజాగా మరో చిత్రంలోనూ నటిస్తున్నారు.  ‘కృష్ణమ్మ’ (Krishnamma) అనే టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ కొత్త చిత్రంలో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ రోజు సత్యదేవ్ 32వ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అలాగే ఆయనకు బెస్ట్ విషెస్ తెలుపుతూ అదిరిపోయే పోస్టర్ నూ వదిలారు. ఈ పోస్టర్స్ లో సత్యదేవ్ కృష్ణ డ్యామ్ వద్ద వర్షంలో తడుస్తూ చేతిలో కత్తిపట్టుకొని నిల్చుని కనిపిస్తాడు. ఏదో కోల్పోయాడని ఆయన హావభావాలు తెలుపుతున్నాయి. మరో పోస్టర్ లో నుదిటన బొట్టు పెట్టుకొని, మెడలో రుద్రాక్షమాల ధరించి.. లాంగ్ హెయిర్, బియర్డ్, మీసాలతో గంభీరంగా కనిపిస్తున్నాడు. సత్యదేవ్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రస్తుతం ఈ పోస్టర్స్ నెటజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ సమర్పిస్తున్నారు.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Satyadev (@actorsatyadev)

ప్రస్తుతం సత్యదేవ్ ‘గుర్తుందా సీతాకాలం’, ‘రామ్ సేతు’, ‘గాడ్ ఫాదర్’, ‘ఫుల్ బాటిల్’ చిత్రాల్లో నటిస్తున్నారరు. ఇప్పటికే ‘గుర్తుందా సీతాకాలం, రామ్ సేతు’ చిత్రాలు షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చేరుకున్నాయి. మిగిలిన చిత్రాలు శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటున్నాయి. సత్యదేవ్ ఇలా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఆడియెన్స్ ను, ఆయన ఫ్యాన్స్ ను అలరించే పనిలో ఉన్నాడు.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Satyadev (@actorsatyadev)

click me!