Bigg Boss Telugu 7 : అమర్ దీప్ సీక్రెట్ ను బయపెట్టిన అర్జున్.. శివాజీ కూడా ఆడేసుకున్నాడుగా..

Published : Dec 15, 2023, 11:14 PM IST
Bigg Boss Telugu 7 : అమర్ దీప్ సీక్రెట్ ను బయపెట్టిన అర్జున్.. శివాజీ కూడా ఆడేసుకున్నాడుగా..

సారాంశం

బిగ్ బాస్ తెలుగు 7 రెండ్రోజుల్లో ముగియనుంది. ఆదివారం విన్నర్ ను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా తాజా ఎపిసోడ్ లో ఇంటి సభ్యుల మధ్య ఫన్నీ మూమెంట్స్ క్రియేట్ అయ్యాయి. ఈ క్రమంలో అమర్ దీప్ ను అర్జున్, శివాజీ ఆడేసుకున్నారు కూడానూ..  

ఎంతో ఆసక్తికరంగా Bigg Boss Telugu 7  కొనసాగింది. ముందుగానే చెప్పినట్టుగా సీజన్ మొత్తం ఉల్టా పుల్టాగానే సాగింది. ఇంట్రెస్టింగ్ గేమ్స్, ఎలిమినేషన్స్, కంటెస్టెంట్ల మధ్య పోరు రసవత్తరంగా మారింది. ప్రస్తుతం సీజన్ 7 ముగింపు దశకు చేరుకుంది. ఈ పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 7 రెండ్రోజుల్లో ముగినుంది. ఆదివారం విన్నర్ ను ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఫైనల్స్ లో ఆరుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. శివాజీ, అమర్ దీప్, యావర్, అర్జున్, ప్రియాంక, పల్లవి ప్రశాంత్ టైటిల్ కోసం పోటీపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఫైనల్స్ ఆసక్తికరంగా జరుగుతోంది. ఇప్పటికే లాస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన షూట్ కూడా ప్రారంభమైందని తెలుస్తోంది. ఈ సందర్భంగా విన్నర్ ఎవరనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

శుక్రవారం ప్రసారమైన 103వ రోజు ఎపిసోడ్ చాలా ఫన్నీగా సాగింది. ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఫన్నీ టాస్క్ ఆడించాడు. అమర్ దీప్ ని జ్యోతిష్కుడుగా మార్చాడు. జ్యోతిష్కుడు గెటప్ లో అమర్ ని పోటీదారులు సిద్ధం చేశారు. అయితే తొలుత పల్లవి ప్రశాంత్ జాతకం చెబుతూ అమర్ ఫన్నీ కామెంట్స్ చేశారు. కొన్ని డబుల్ మీనింగ్స్ కూడా మాట్లాడారు. టైటిల్ కు చేరువలో ఉన్నావని చెప్పుకొచ్చారు. అలాగే అమర్ దీప్ జాతకం చెప్పారు. అటు ప్రియాంక జాతకం కూడా చెబుతూ చాలా ఫైర్ బ్రాండ్ అంటూ చెప్పుకొచ్చారు. లోపల ఒకరు, బయట ఒకరు అని చెప్పారు. 

ఇక శివాజీ జాతకం చెబుతూ... తనకు ఇష్టమైన వారిలో యావర్, అమర్ దీప్ ఉన్నారన్నారు. కానీ యావర్ కే ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నారని, తనకేం లేదని జ్యోతిష్యం చెప్పారు. ఇక ఫైనల్ గా  అర్జున్ జాతకం చెప్పేందుకు ప్రయత్నించాడు అమర్ దీప్. కానీ అర్జున్ అమర్ కే షాక్ ఇచ్చాడు. తన జాతకం చెప్పించుకోవడం కాకుండా అమర్ దీప్ జాతకాన్ని చెబుతూ వచ్చాడు. అనగనగా ఓ కారు.. నాకు ఆ కారే గుర్తుకొస్తుందంటూ.... ఓ స్టోరీ చెప్పుకొచ్చారు. దీంతో అమర్ వద్దండి బాబోయ్ అంటూ వేడుకున్నారు. ఇలా వీరిద్దరి మధ్య సీన్ ఆసక్తికరంగా మారింది. 

అలాగే శివాజీ కూడా అమర్ దీప్ జాతాన్ని చెప్పడం ప్రారంభించారు. అమర్ దూకుడుతనంతో వెళ్తున్నారన్నారు. మధ్యలో తనతో ఎన్ని విభేధాలు ఏర్పడినా ఇప్పుడిప్పుడు బాగా క్లోజ్ అయ్యారని చెప్పుకొచ్చారు. ఈ గేమ్ తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్లకు మరో ఇంట్రెస్టింగ్ టాస్క్ ఇచ్చారు. ఇంటి ఫుడ్ ను గెలుచుకునే అవకాశాన్ని బిగ్ బాస్ కల్పించారు. అంతకంటే ముందు ఓ గేమ్ ఆడించారు. ఈ గేమ్ లో అర్జున్ గెలుపొందారు. గెలుపొందిన వారు తమ ఫుడ్ ను మరోకరి అందించాల్సి ఉంటుంది. దీంతో తన ఫుడ్ ను పల్లవి ప్రశాంత్ కు ఇచ్చారు. ఇందు ప్రశాంత్ థ్యాంక్స్ చెప్పారు. 

మొత్తానికి ఆదివారంతో ఈ రియాలిటీ షో ముగియనుంది. చివరి వారం కావడంతో హౌజ్ మేట్స్ రిలాక్స్ అవుతున్నారు. చిన్న చిన్న టాస్క్ లతో సరదాగా గడుపుతున్నారు. హౌజ్ లో టాప్ 6 కంటెస్టెంట్లు ఉన్నారు. శివాజీ, అమర్ దీప్, ప్రశాంత్ పల్లవి, యావర్, అర్జున్, ప్రియాంక ట్రైటిల్ గెలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈసారి ఫినాలేకు మహేశ్ బాబు రాబోతున్నారని తెలుస్తోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Peddi Controversy: రామ్ చరణ్ మాటలకు క్రికెటర్ బుమ్రా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడా? అసలేం జరిగింది?
Bandla Ganesh House: బండ్ల గణేష్‌ కొత్తింటి ధర ఎన్ని కోట్లో తెలిస్తే మతిపోవాల్సిందే.. చిరంజీవి ఇంటి ధర అందులో సగం కూడా ఉండదు