క్లీయర్‌ చేసుకోవాలని ఇంటినుంచి పంపిస్తారా? అరియానా ఫైర్‌.. వణికిపోయిన సోహైల్‌

Published : Oct 26, 2020, 11:49 PM IST
క్లీయర్‌ చేసుకోవాలని ఇంటినుంచి పంపిస్తారా? అరియానా ఫైర్‌.. వణికిపోయిన సోహైల్‌

సారాంశం

అరియానా సైతం ఫైర్‌ అయ్యింది. ఎన్నడూ లేని విధంగా ఆమె మండిపడింది. మెహబూబ్‌.. అరియానాని నామినేట్‌ చేశాడు. తమ మధ్య కొంత కాలంగా విభేదాలున్నాయని, వాటిని క్లీయర్ చేసుకుందామన్నాడు.   

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ 50వ రోజు ఎనిమిదో వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన నామినేషన్‌ ప్రక్రియా వేడివేడిగా జరిగింది. ఒకరిపై ఒకరి ఆరోపణలతో రసవత్తరంగా సాగింది. ఇందులో ఓ వైపు అఖిల్‌, అమ్మా రాజశేఖర్‌ గొడవపడితే.. అరియానా సైతం ఫైర్‌ అయ్యింది. ఎన్నడూ లేని విధంగా ఆమె మండిపడింది. మెహబూబ్‌.. అరియానాని నామినేట్‌ చేశాడు. తమ మధ్య కొంత కాలంగా విభేదాలున్నాయని, వాటిని క్లీయర్ చేసుకుందామన్నాడు. 

ఇక తన వంతు వచ్చినప్పుడు అరియానా గట్టిగా రియాక్ట్ అయ్యింది. క్లియర్‌ చేసుకోవాలని చెప్పి ఇంటి నుంచి పంపిస్తారా? ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడుకోవాలనిగానీ, నామినేట్‌ చేసి ఇంటినుంచి పంపించేందుకు నామినేట్‌ చేయడమేంటని మండిపడింది. ఫస్ట్ టైమ్‌ ఫైర్‌ అయ్యింది. 

ఇక సోహైల్‌ వంతు వచ్చినప్పుడు అరియానాని నామినేట్‌చేశారు. మెహబూబ్‌ విషయంలోనే అరియానా చేసినదానికి తనని నామినేట్‌ చేస్తున్నానని తెలిపారు. దీంతో అరియానా చాలా సీరియెస్‌గా ఉంది. ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా అలా ఉండిపోయింది. ఆమెని చూసి సోహైల్‌ భయపడ్డారు. కాసేపు హంగామా చేశాడు. అరియానా ముఖం చూసి వణికిపోయినంత పనిచేశాడు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌