కూతురి బర్త్ డే.. అల్లు అర్జున్ స్టైలిష్ సెలబ్రేషన్స్!

By Prashanth MFirst Published Nov 21, 2018, 4:14 PM IST
Highlights

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఎంత మంచి గుర్తింపు తెచ్చుకున్నాడో అదే తరహాలో ఒక మంచి ఫ్యామిలీ పర్సన్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. 

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఎంత మంచి గుర్తింపు తెచ్చుకున్నాడో అదే తరహాలో ఒక మంచి ఫ్యామిలీ పర్సన్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్న బన్నీ తన ఫ్యామిలీ తో ఎప్పటికప్పుడు టైమ్ స్పెండ్ చేస్తూనే ఉంటాడు. 

అవసరమైతే కొన్ని సార్లు వారిని షూటింగ్ లొకేషన్స్ కు తెచ్చేసుకుంటాడు. ఇక గత కొంత కాలంగా ఖాళీగా ఉంటున్న స్టైలిష్ స్టార్ కుటుంబంతో ఎక్కువగా గడుపుతున్నాడు. నేడుబన్నీ గారాల కూతురు ఆర్హ రెండవ పుట్టినరోజు కావడంతో స్టైలిష్ గా సెలబ్రేట్ చేస్తున్నాడు. గోవాలో తన చిన్న ఫ్యామిలీతో పాటు మరికొంత మంది ఫ్యామిలీ చిల్డ్రన్స్ తో ఎంజాయ్ చేస్తున్నాడు. 

సినీ స్టార్ గా ఎంత గుర్తింపు తెచ్చుకున్నా బన్నీ తన పిల్లల దగ్గరకు వస్తే తను కూడా చిన్న పిల్లాడిలా మారిపోతాడు. వారితో ఎక్కువగా గడపడానికి ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం బర్త్ డే సెలబ్రేషన్స్ కి సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక అభిమానులు కూడా స్టార్ హీరో డాటర్ కి బర్త్ డే విషెస్ అందిస్తున్నారు. 

click me!