రామ్ చరణ్ తో బన్నీ వైరం.. మెగాహీరో క్లారిటీ!

By AN TeluguFirst Published 19, May 2019, 3:23 PM IST
Highlights

మెగాహీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్ ల మధ్య విబేధాలు ఉన్నాయంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి మధ్య ఈగో సమస్యలు ఉన్నాయని కథనాలను ప్రచురించారు.

మెగాహీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్ ల మధ్య విబేధాలు ఉన్నాయంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి మధ్య ఈగో సమస్యలు ఉన్నాయని కథనాలను ప్రచురించారు.

చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమాపై అందరూ స్పందించారు కానీ అల్లు అర్జున్ రియాక్ట్ కాకపోవడంతో వీరిద్దరి మధ్య గొడవలు నిజమే అనుకున్నారు. అయితే ఈవార్తల్లో నిజం లేదని గతంలో అల్లు అర్జున్ కొట్టిపారేశాడు. అయినప్పటికీ ఈ వార్తలకు బ్రేక్ పడలేదు. తాజాగా అల్లు శిరీష్ ఈ విషయంపై స్పందించాడు.

తను నటించిన 'ఏబీసీడీ' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ.. బన్నీ, రామ్ చరణ్ విబేధాల గురించి స్పందించాడు. వారిద్దరూ చిన్నప్పటి నుండి కలిసి పెరిగారని, ఇప్పటికీ తరచూ కలుస్తూనే ఉంటారని.. ఎప్పటికప్పుడు కలుసుకుంటూ అన్ని విషయాల గురించి చర్చించుకుంటూ ఉంటారని చెప్పాడు.

వారిద్దరి మధ్య విబేధాలనే విషయంలో ఏమాత్రం నిజం లేదని.. వారిద్దరు మాట్లాడుకోరని అనడంలో అర్ధం లేదని అన్నారు. కొందరు యూట్యూబ్ వ్యూస్ కోసం అలాంటి కథనాలు రాస్తున్నారని, అలాంటి వార్తలను అసలు నమ్మొద్దని సూచించారు. మెగాహీరోలంతా కూడా సఖ్యతతో ఉన్నారని.. ఒకరిపై ఒకరు ఈగోతో లేరని అన్నాడు. 

Last Updated 19, May 2019, 3:23 PM IST