సెక్స్ కోరికలతోనే వాళ్లు అలా చేస్తున్నారు.. నటి కామెంట్స్!

By AN TeluguFirst Published 19, May 2019, 2:57 PM IST
Highlights

దేశంలో జరిగే రేప్ లకు అమ్మాయిలు వేసుకునే బట్టలు కారణం కాదంటున్నారు నటి గాయత్రి గుప్తా. 

దేశంలో జరిగే రేప్ లకు అమ్మాయిలు వేసుకునే బట్టలు కారణం కాదంటున్నారు నటి గాయత్రి గుప్తా. 'ఫిదా', 'ఐస్ క్రీం', 'మిఠాయి' వంటి చిత్రాల్లో నటించిన గాయత్రి గుప్తా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని బోల్డ్ కామెంట్స్ చేసి అప్పట్లో పాపులర్ అయింది.

తాజాగా ఆడవాళ్ల వస్త్రధారణపై సంచలన కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ. రేప్ లు ఎక్కువగా ఎందుకు జరుగుతాయంటే.. సెక్సువల్ ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అవ్వడం వల్లే అని చెబుతోంది గాయత్రి. ఆకలిగా ఉన్నప్పుడు తిండి దొరకకపోతే మనిషి ఏం చేస్తాడో.. సెక్స్ కోరికలు కలిగినప్పుడు ఒత్తిడితో తప్పు అని తెలిసినా.. రేప్ చేస్తున్నారని.. అంతేతప్ప అమ్మాయి వేసుకున్న డ్రెస్ వలన కాదని చెప్పుకొచ్చింది. 

ఇండస్ట్రీలోకి రావడానికి చాలా మంది భయపడుతున్నారనే కంటే.. భయపడే మనిషి ఏది చేయాలన్నా.. భయపడతాడని అంటోంది. ఇళ్లు దాటి బయటకి వచ్చావంటే ధైర్యం చేసినట్లేనని.. అది సినిమా ఇండస్ట్రీ అయినా.. సాఫ్ట్ వేర్ ఉద్యోగమైనా.. ఒకటే అని ఎక్కడ ఉండే సమస్యలు అక్కడ ఉంటాయని చెప్పుకొచ్చింది.  

Last Updated 19, May 2019, 2:57 PM IST