ఎన్టీఆర్ ఫోటోలు మళ్లీ లీక్.. 'అరవింద'కు లీకుల బెడద!

By Udayavani DhuliFirst Published 10, Aug 2018, 4:19 PM IST
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అరవింద సమేత' అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అరవింద సమేత' అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా టీజర్ ను ఆగస్టు 15న విడుదల చేయనున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ నుండి కొన్ని ఫోటోలు లీక్ అయిన సంగతి తెలిసిందే. అందులో ఎన్టీఆర్ తో పాటు నాగబాబు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ సన్నివేశానికి సంబంధించిన ఫోటోలు ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి.

లీకైన ఫోటోల్లో ఎన్టీఆర్ సీరియస్ గా కనిపిస్తుండగా.. నాగబాబు ఏదో ప్రమాదంలో ఉన్నట్లు కనిపించారు. లీకుల విషయంలో దర్శకుడు త్రివిక్రమ్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. వర్కవుట్ కావడం లేదు. ఇప్పుడు లీకులు ఎవరు చేస్తున్నారనే దానిపై చిత్రబృందం దృష్టి పెట్టి సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే కనిపించనుంది. అలానే జగపతిబాబు మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 10న సినిమాను విడుదల చేయబోతున్నారు. 


 

Last Updated 9, Sep 2018, 12:18 PM IST