స్టార్ యాక్టర్ ను తన సినిమాలో విలన్ గా సిఫార్స్ చేసిన రామ్ చరణ్

Published : Mar 22, 2022, 12:35 PM IST
స్టార్ యాక్టర్ ను తన సినిమాలో విలన్ గా సిఫార్స్ చేసిన రామ్ చరణ్

సారాంశం

వరుస సినిమాలు సెట్ చేసుకుంటూ దూకుడు మీద ఉన్నాడు రామ్ చరణ్. తన సినిమాలకు సంబంధించిన పనులు కూడా తానే దగ్గరుండి చూసుకుంటున్నాడు. రీసెంట్ గా తన నెక్ట్స్ మూవీలో విలన్ క్యారెక్టర్ కోసం స్టార్ యాక్టర్ ను సిపార్స్ చేశాడట.    

చరణ్  దూకుడుమీద ఉన్నాడు. ట్రిపుల్ ఆర్ వల్ల మూడేళ్లు గ్యాప్ రావడంతో.. చరణ్ ముందుగానే మేల్కొన్నాడు. చరణ్ కంటే ముందు నుంచే అంటే 2018 నుంచీ ఎన్టీఆర్  సినిమా చేయలేదు. అయితే తారక్ కంటు ముందే మేల్కొన్ని ట్రిపుల్ ఆర్ రిలీజ్ అవ్వక ముందే శంకర్ తో సినిమా స్టార్ట్ చేశాడు చరణ్. ఇక రామ్ చరణ్ నుంచి రెండు భారీ సినిమాలు ఈ ఏడాది రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. 

రాజమౌళి దర్శకత్వంలో ఆయన చేసిన ఆర్ఆర్ఆర్  ఈ నెల 25న ఆడియన్స్  ముందుకు రానుంది. దాంతో పాటు కొరటాల దర్శకత్వంలో చేసిన ఆచార్య ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ తరువాత ఆచార్య ప్రమోషన్స్ మొదలయ్యేవరకూ ఆయన శంకర్ సినిమాపై దృష్టి పెట్టనున్నాడు. 

ఇక స్టార్ డైరెక్టర్ శంకర్ తో తెరకెక్కుతున్న సినిమాను  భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ క్యారెక్టర్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేశాడట శంకర్. అయితే ఇందులో విలన్ పాత్ర కూడా అంతే డిఫరెంట్ గా ఉంటుందని సమాచారం. ఇక ఈ క్యారెక్టర్  అవినీతి రాజకీయ నాయకుడిగా డిజైన్ చేయబడిందని సమాచారం.  ఈ పాత్రను శంకర్ చాలా పవర్ఫుల్ గా డిజైన్ చేశాడట. 

ఈ పాత్ర కోసం  చాలా మంది పేర్లు వినిపించాయి. అందులో స్టార్ తమిళ్ డైరెక్టర్ ఎస్.జె. సూర్యను దాదాపుగా తీసుకున్నారు అని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఈ పాత్ర  కోసం మాజీ హీరో.. ప్రస్తుతం క్యారెక్టర్ నటుడు  అరవింద్ స్వామి పేరు తెరపైకి వచ్చింది. అరవిందస్వామి అయితే ఈ క్యారెక్టర్ కు కరెక్ట్ గా సూట్ అవుతాడు అని మేకర్స్ భావిస్తున్నారట. 

గతంలో చరణ్ హీరోగా తెరకెక్కిన ధ్రువ సినిమాలో అరవింద్ స్వామి విలన్ గా మెప్పించాడు. ఈ సినిమాతో చరణ్ కు అరవింద స్వామికి మధ్య రాపో కూడా పెరిగింది. అప్పటి స్నేహాన్ని దృష్టిలో పెట్టుకోవడమే కాకుండా.. అరవిందస్వామి నటనకు ఫిదా అయిన చరణ్.. ఈసినిమాలో  ఆయన అయితే బాగుంటాడని చెప్పాడట దాంతో ఈ మూవీలో అరవింద స్వామిని శంకర్ రంగంలోకి దింపుతున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వాని నటిస్తుంది.  తమన్ స్వరాలు అందిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా